అభాగ్యులు

అభాగ్యులు

రచయిత :: మల్లాదిసోమేశ్వరశర్మ

పొట్ట గడవక
జీవితం గడపాలని
కొండంత ఆశతో పిల్లాపాపలతో
పట్నానికి వెడ్తే
కరోనా కాటుకు
యజమాని బలైతే
వేరు దిక్కు లేక
దిక్కుతోచక
ఆకలి తో చావలేక
ఇంటిముఖంపట్ట
దారిలోనే వాహన
రూపంలో తల్లి మృత్యువాత
పడితే చంటి
పిల్లలు ఏడుస్తుంటే
వారినూరడించలేక
సముదాయించలేక
అనాథాశ్రమాలకు
అప్పచెప్పెకొందరు
మానవతామూర్తులు
అభాగ్యులను
అనాథలను!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!