ఎదురు చూసిన వేళ

(అంశం:”సంధ్య వేళలో”)

ఎదురు చూసిన వేళ

రచన: సుజాత.కోకిల

సాయంసంధ్యవేళలలో గలగలా రాగాలతో పక్షులు ఇంటికి చేరే వేళలలో

తోడులేని ఏకాకిలా
మోడువారిన చెట్టు లా
నీ రాకకై వేచి ఉన్న వేళ
నా మనసునిండా నిన్నే నింపుకొని
పరవశించిన వేళలలో
మల్లెతీగలా నిన్ను అల్లుకుపోవాలని
కోకిల పాడిన పాటల నీ ఎదలో చేరాలని గలగల పారే గోదావరిలా నీ పాదాల చెంత చేరాలని
నా ఎదనిండా నిన్నే నింపుకొని
నీవు పిలిచే పిలుపుకెై
ఆ సాయం సంధ్యవేళలలో
నా గుండె తలుపులు తెరుచుకుని
నీ వాకిట ముందు నిలిచిన నీ ఎదలో చోటు ఇస్తావని ఆశిస్తున్న నీ ప్రియురాలిని
………………………

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!