ప్రకృతి కాంత

(అంశం:”సంధ్య వేళలో”)

ప్రకృతి కాంత

రచన: దాకరపు బాబూరావు

రేయి దుప్పట్లోంచిప్రకృతి కాంత

బద్ధకంగా వొళ్ళు విరుచుకుంటూ
మసక చీకట్లకళ్ళను మౌనంగా నులుముకుంటూ…

తూరుపు సంధ్య లో
ఇంకా మొలవని బాల భాస్కరుని
తొలికిరణాల అల్లిక కోసం
అభిసారిక అవుతున్న దృశ్యం
కడు కమనీయం…

చీకటికీ వెలుగుకీ మధ్యమంగా
కాలం శ్రుతిచేసిఆలపించే
హృద్యకాంతిగీతాన్ని
ఆస్వాదించే ఏ హృదయమైనా
సంధ్యారాగ వందన సంగీతమే…

పక్షుల కిలకిలా రావాలతో
తుషారబిందువుల్ని పొదిగిన
ముత్యాల పచ్చలహారాన్ని ధరించేప్రకృతి కాంతకు
ప్రతి ఉదయమూ ఒక దృశ్యావిష్కరణమే…

ప్రకృతి కాంత ప్రతి ఉదయమూపొడుచుకునే లేలేతవెలుగుల పచ్చబొట్టు సంధ్యా కాలం..
………………….

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!