ఈ సంధ్య వేళలో

(అంశం:”సంధ్య వేళలో”)

ఈ సంధ్య వేళలో

రచన: యాంబాకం

ఈ సంధ్యవేళలో భానుడి ముఖారవిందం ఎరుపు వర్ణము దిద్దుకొంది బహుశా పుడమి తల్లి కుంకుమ బొట్టు అడ్డు వచ్చెనేమో కాబోలు

ఈ సంధ్యవేళలో సాగరుని కులుకులు ఉరుకులు చాలించి కామరూపుడై కనబడుచుండెనే బహుశా వెన్నెల రాకకు కాబోలు
ఈ సంధ్యవేళలో ఆకాశరాజు పెళ పెళ మెరుపుల ధ్వనులతో పయణిస్తున్నట్లుగా ఉన్నాడు బహుశా ఇంద్రసభలో రంభ ఊర్వశిల నాట్య విన్యాసాలు వీక్షించుటకు కాబోలు
ఈ సంధ్యవేళలో కారుమబ్బులు తహ తహ లాడుతూ బారులు బారులు గా కదలి సాగుతున్నవి బహుశా వరుణి పిలుపు కాబోలు
ఈ సంధ్యవేళ లో కలువభామలు కలువరేకులను విప్పుకొని తొంగి చూస్తున్నాయి బహుశా నెలవంక రాక కుఎదురు చూపులు కాబోలు
ఈ సంధ్యవేళలో చుక్కలు ఒకటి ఒకటీగా గగనవీధి లోకి పయనమాయను బహుశా వాటి సోయగాలు చూపుటకు కాబోలు
ఈసంధ్యవేళలో తపస్విలు నదీతీరాన భగవారాదనకై పయనమాయను బహుశా సంధ్య వార్చుటకై కాబోలు

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!