సంధ్యాకాల సమయం

(అంశం:”సంధ్య వేళలో”)

సంధ్యాకాల సమయం

రచన: శృంగవరపు శాంతికుమారి

దినమంతా అలసిసొలసిన

సూరీడు పడమరదిక్కున
వాలి సేదతీరుతున్నవేళ!
సంధ్యకాల భానుడు నూతన కాంతులతోదేదీప్యమానంగా ప్రకాశిస్తున్నవేళ!
పక్షుల కిలకిల రావాలతో
సొంతగూటికి చేరేవేళ!
గోధూళివేళ గోవులు తమస్థావరాలకు చేరుకొనేవేళ!
పల్లెప్రజలు పొలంలో రోజంతా కష్టపడి ఇల్లుచేరి సేదతీరువేళ!
పసిపిల్లలు అమ్మ జోలపాటతో హాయిగా నిదురించువేళ!
సంధ్యాకాల మేరురంగు కాంతుల వలపులతో పెనవేసుకొను ప్రకృతిని ఆస్వాదిస్తూ ముచ్చట్లాడువేళ!
చెట్టుకొమ్మలువయ్యారాలు వలకబోస్తూ నాట్యమాడేవేళ!
మనసు ఆనందడోలికలో ఊయలూగువేళ!
సంధ్యవేళ తొలిపొద్దు మబ్బుల్లో దాక్కొని దోబూచులాడువేళ!
చంద్రోదయ లేలేత కిరణాలు ప్రసరించువేళ!
ఆక్షణం సూర్యుడికి విశ్రాంతి జీవరాశులకు ప్రశాంతత చేకూరును!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!