రెక్కలిరిగిన పక్షులు చెప్పే జీవిత సత్యం

రెక్కలిరిగిన పక్షులు చెప్పే జీవిత సత్యం (కథ సమీక్ష )
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

సమీక్షలు: యాంబాకం

రచన : లహరి

     ఇక్కడ పాత్రలు పాత్రధారులు కథ చదివేటప్పుడు సున్నితంగా పాఠకుల మనసు హత్తు కొనేలా చాలా బాగా ఉంది. చిన్న కథ ఐనా పెద్ద బావన వచ్చేలా వ్రాసారు రచయిత్రి లహరి గారు. నాకు కూడా వాస్తవ మే అని పించింది. ముఖ్యంగా ముసలితనం లో మనుషులు ఇంచుమించు గా పురిటి బిడ్డలు లాగే ఉంటారు. అప్పుడు వారికి ఒకరి తోడు ఖచ్చితంగా అవసరం అవుతుంది. అది పిల్లల కు అర్దం కాకపోవచ్చు. ఆ వయసులో అర్దం కాకపోవచ్చు. ఇలాంటి కుటుంబ సెంటిమెంట్ బావాలు వినడానికి చూడడానికి చాలా బాధగా ఉంటుంది. ఇక్కడ అలాగే లహరి గారు చూపించారు వారి కలం యొక్క చాతుర్యం ఒక ఆఫీసర్గా పని చేసి ఎంతో మంది దగ్గర గుర్తింపు పొంది ఎంతో కొంత ప్రజలకు, గౌవర్నమెంటుకు సేవలు అందించిన ఆఫీసర్ చివరికి ఒంటరి పోరు ను రచనలో మెప్పిచారు. రచయత్రి లహరి గారు. ఇక్కడ కథ ను లహరి గారు రెండు కోనాలలో వ్రాసారని కాస్త మనసుపెట్టి చూస్తే అని పిస్తుంది. ఒక కోనంలో పిల్లలను దోషులుగాను, మరో కోనం లో మూర్తి గారిదే తప్పు ఆనడానికి కొన్ని సంఘటనలు కూడా ఈ కథాంశం ప్రకారం ఆలోచించాలి. మూర్తి అంత పెద్ద ఆఫీసర్ ఐయియుండి కేవలం భవిష్యత్ లో బిడ్డల మీద ఆదారపడటం అనే పాయింటు కాస్త సబబుగా లేదు. ఇంకా బిడ్డలు వారి తో ఉంచుకొంటాము అని తీసుకెళ్లి తీర వదిలేసి వేళ్ళి పోయేదాక అది వృద్ధాశ్రమం అని తెలుసుకో లేని అంత అమాయకుడు కాదు మూర్తి అదే మూర్తి ఎదో ఒక కూలి, నార చేసేకొని బ్రతికే అమాయకుడు అన్నా ఐయుంటే, సరే మా స్థితిని నలుగురికి చెప్పకోవడానికి ఇష్టం లేక ఇలా చేసారు పిల్లలు అనుకోవడానికి కాదే మూర్తి ఒక ఆఫిసర్ అమయకుడు కాదు. బిడ్డల దగ్గర మోసపోవడానికి ఇక్కడ చదివే పాఠకులను బట్టి నిర్ణయించడం జరుగుతుంది.  ఇక్కడ తల్లిదండ్రులు కూడా రెండు రకాలు గా ఉంటారు అని ఈ రచన ద్వారా లహరి గారు అభిప్రాయం వ్యక్త పరిచారు. కానీ  సహజంగా చిన్న చిన్న  ఉద్యోగం వ్యాపారం కూలీ ఇలా కాయికష్ట చేసుకొని మన బ్రతుకులు చివరు రోజు ఎలా ఉంటుందో పిల్లలన్నా  చదువుకొంటే పని చేయలేని పరిస్థితి లలో బిడ్డ లు ఆదు కొంటారు చేతికి అందివస్తారు. అని సహజమైన అలోచన తల్లిదండ్రుల కు ఉండటం పరిపాటి. కానీ ఒక గౌవర్నమెంటు ఆఫీసర్ గా  ఒక నిర్ధిష్టమైన జీతం నెలకు తీసుకొంటూ ప్రపంచంతోనే పని లేని జాబ్  చేసేవారికి నా బిడ్డలు చూస్తారు. నన్ను కడతేరుస్తారు, అనే అలోచన చాల తక్కువ మంది లో ఉంటుంది. ఈ కథలో మూర్తి ఆఫీసర్ ఐన అప్పటికి ఆశ పడ్డాడు అంటే తను కూడా ఒక సాధారణం గానే అలోచించారని చదివే పాఠకులకు అనిపించేలా వ్రాయడం కూడా లహరి గారు పతిభ. కానీ ఈ బాధ మూడవ వ్యక్తి బలపరిచారు ఆమూడవ వ్యక్తి శిరీష ఎప్పుడూ అంతే మనిషి జీవితంలో ఎక్కువ గా బాధ పడేది. మూడవ వ్యక్తి నే! బాధ పడావలసి మొదటి, రెండవ వ్యక్తులు మాత్రం ఎప్పుడూ బాధ పడరు . అదే మనిషి లో తెలియని లోపం ఎవరికో బాగ లేదంటే అందరికీ పదే పదే చెప్పి సానుభూతి చూపుతారు. ఇంట్లో వ్యక్తి కి విషయానికి వచ్చేసరికి ఇదా మాకు ఎప్పుడూ ఉండే దేలే అని నిట్టూర్పులు ఇస్తారు. ఇదే మరి. టోటల్ గా ఈ కథ చాలా చక్కగా మధ్య తరగతి వారికి దగ్గరగా మలిచిన తీరు పట్ల రచయిత లహరి గారికి నా ధన్యవాదాలు.

 

రెక్కలిరిగిన పక్షులు చెప్పే జీవిత సత్యం (కథ):

https://thapasvimanoharam.com/weekly-magazines/weekly-magazine-13-03-2022/ 

తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య వారపత్రిక వెబ్సైట్ లింక్ తేదీ.13-03-2022

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!