ఒంటరిని

ఒంటరిని

రచయిత::బండి చందు

ఒంటరి కొలను తుంటరి చేపని
ఎడారి ఎండమావి బాటసారిని
తడారని గొంతుక ముత్యపు చినుకుని
నిశి రాతిరి నిండు చందమామని
సంద్రపు అలల సంగీతపు హోరుని
అడవినంటి ఆరని అగ్ని జ్వాలని
ఈడేరి నలిగిన కన్నె మనసుని
కడసారి చూపు నోచుకోని కన్నీటిని
గతం తాలుకు గాయాలు దాచుకున్న శిలని
అబద్ధాల చెంపలపై రాలు నిజాల కాంతిని
భవిష్యత్తు బాధ్యత బరువులు మోసే కావడిని
మోయజాలని జ్ఞాపకాల హృదయపు వేదనని
నిన్నటి తరాల రేపటి భవిష్యత్తు భారాన్ని
రేపటికి నేను అడవి కాచిన వెన్నెలని….

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!