ఎడారి వాన

ఎడారి వాన

రచయిత- వాడపర్తి వెంకటరమణ

మనమెన్నో పుస్తకాల్ని ఔపోసనపట్టి/
జ్ఞాన మాలికల్ని మెడలో ధరించవచ్చు/
పలు పలు పతకాలు సాధించి/
పతాక శీర్షికలతో పేరుగాంచనూవచ్చు/
ఒక అన్యాయం జడలువిప్పి/
విచ్చలవిడిగా ఊరేగుతున్నప్పుడు/
ఒక అధర్మం కొండచిలువై/
సామాన్యుడ్ని సైతం మింగేస్తున్నప్పుడు/
ప్రశ్నించలేని మన మేథోతనం/
ఎడారిలో కురిసే వానే అవుతుంది/
మౌన కుర్చీలో కూర్చున్న మన విద్వత్తంతా/
అడవి గాంచిన వెన్నెలవుతుంది!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!