మాయదారి కాలం

మాయదారి కాలం

రచయిత :: శ్రీదేవి విన్నకోట

అసలే ఇది కరోనా అంటిన కర్కశ కాలం.
ఆనందాన్ని ఉత్సాహాన్ని ఆవిరి చేసే కాలం.
మనుషుల్ని బొమ్మల్లా మాయం చేసే కష్టకాలం.
ఊపిరి అందని క్షణాలతో ఉక్కిరిబిక్కిరి అయ్యే కాలం డబ్బుతో ప్రాణాలను కొనలేని కొరివిలా మారిన కాలం
భయంతో బ్రతుకు ఈడుస్తున్న వారి ప్రాణాలను అవలీలగా అనంత వాయువుల్లో కలిపేసె కాలం.
మనిషి ప్రాణం గాలి అందక ఆ గాలిలోనే
కలిసిపోయే మాయదారి కాలం
మనిషి ఆశల్ని ఊహల్ని కాలరాసే కర్కోటక కాలం.
ఏ వైపు నుంచి మృత్యువు ముంచుకొస్తుందో తెలియని అగమ్యగోచర కలికాలం
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అనుకోకుండా కాలానికి బలయిపోయేలా చేసే విపత్కర కాలం.
మన కలల్ని కోరికల్ని అడవి గాచిన వెన్నెల చేసే కాలం.మన ఆశలు ఊహలు అడవినీ గాచిన వెన్నెల కాదని
సంతోషాన్నిచ్చే మంచి కాలం ముందు ఉందని,ఈ కష్టకాలం అంతమైపోతుందని ఆశిస్తూ
మనం కాలంతో కలసి పయనిద్దాం.ఈ కరోనా విపత్తు విజయవంతంగాఎదుర్కొందాం
కరోనాపై మన పోరాటం వమ్ము కాదని అందరికీ త్వరలో గెలుపే మన సొంతమని
మన ప్రయత్నం ఫలిస్తుంది
అని ఎలుగెత్తి చాటుదాం.
ఈ ముప్పును అతి త్వరలోనే తరిమితరిమి కొడదాం.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!