నాలోని నేను..

నాలోని నేను..

(తపస్వి మనోహరం – అంతర్జాల పత్రిక)

రచన: కె.రాధికనరేన్

మనసు కన్నీటి సంద్రమై
నాలోని భావాలు ఉబికివస్తూ
అక్షర రూపంలో పొంగుతుంటే
కలం సాక్షిగా కవితలా కాగితం నింపేస్తూంటే
ఆ జ్ఞాపకాలలో మధురమైనవెన్నో
బాధించినవెన్నో నా వేదనను ఒలికించినవి మరేన్నో
అర్థం లేని భావాలు ఎన్నో అక్షరాల అల్లికలో
మాలలై మదిలోని వ్యథను మరిపించె
కాలం పరుగులో కాసేపు వెనుకకు చూసిన
నా మనసు అద్దం నన్ను నాకు చూపిస్తుంది

మదిలో మాటల యుద్దాలు
మన్నింపుల బుజ్జగింపులు
ఆలోచనల ఆర్తనాదాలు
సంతోషాల సౌరభాలు
అన్నీ కలుపుకొని
సమాధానాలు లేని ప్రశ్నలకు
జవాబులను రాసేది
తడబడిన అడుగులకు
బాటసారిని చేసింది ఈ సాగే పయనం
సాగుతోంది ఇలా నాలోని నేనుగా

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!