కవికోకిల మన జాషువా!

కవికోకిల మన జాషువా!

రచన::పిల్లి హజరత్తయ్య

వీరయ్య లింగమ్మల పుత్రుడై
వినుకొండ నుంచి విశ్వనరుడై
సాహిత్యంలో తనదైన ముద్రవేసిన
కవికోకిల మన జాషువా

మంచి పనులు చేసి మహానీయుడై
ప్రజల శ్రేయస్సే పరమావధియై
సాహిత్యంలో చెరగని ముద్రవేసిన
ప్రజాకవి మన గుర్రం జాషువా

మనిషిని మనిషి తాకకూడదనే ఘోరాన్ని
మానవుల మధ్య అడ్డుగోడల్ని
అస్పృశ్యత జాడ్యాన్ని ప్రశ్నించిన
అభ్యుదయకవి మన జాషువా

గబ్బిలం,ఫిరదౌసితో మెరిసి
క్రీస్తుచరిత్ర, ‘నా కథ’యని రాసి
పేదవారి వికాసాన్ని ఆశించిన
హృదయమున్న కవి మన జాషువా

గుడిలో లింగమూర్తికి లక్షలు ఖర్చుచేసి
గుడిముందు అభాగ్యులను కనికరించరని
పేదల్ని బాగుచేసే ధర్మాత్ములే లేరని
వాపోయిన ప్రజాకవి మన జాషువా

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!