ఆత్మ బంధం

(అంశం : నా అల్లరి నేస్తం)                                                                        ఆత్మ బంధం

రచన :: చైత్రశ్రీ(యర్రాబత్తిన మునీంద్ర)

chaitra sri

పని అయిపోయిందన్నాడు…
వస్తున్నానన్నాడు..
వెతుకులాటనారంభించి
ఎట్టకేలకు రహస్యాన్ని ఛేదించింది నా మనసు…

ఏం లాభం…అంతా అయిపోయాక..
ఏవేవో బాసలాడాలని
ఉవ్విల్లూరే వాయి కల్గిన
మాటల మాంత్రికుడు….
నా ప్రాణ మిత్రుడు శవాలతో
సహవాసం చేస్తాడని
మట్టిలో కలిసిపోతాడనీ
కలగనలేను …కలగనలేదు..

నేనెవరితో మాటాడాలి
నను గుండెకు హత్తుకొనే
ఆ చిలిపి గుండె మాయమైపోయిందే
దైవమా..! సంజీవిని ఇస్తావో
అమృతమే పోస్తావో
నా అల్లరి నేస్తానికి ఊపిరినిచ్చి
తలరాతని మార్చు..!
నా ఆత్మ బంధానికి ప్రాణం పొయ్…!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!