అనుకోని అతిధి

(అంశం : నా అల్లరి నేస్తం)                                                                      అనుకోని అతిధి

రచన :: రమాకాంత్ మడిపెద్ది

మట్టిచేరిన ముత్యాన్ని
చెత్త చేరిన సముద్ర తీరాన్ని
సగం ఉన్న ప్రాణాన్ని
సగం అయిన జీవితాన్ని
వెంటాడే గతాన్ని
గడప లేని ప్రస్తుతాన్ని
ఆశలేని భవిష్యత్తుని
ఆయుషు బరువైన దేహాన్ని
కలలు తీరని దాహాన్ని
నమ్మకం లేని బంధాల్ని
నమ్మలేని నిజాల్ని
ఎవరిని నమ్మకనే కాలాన్ని
కాలం నేర్పిన పాఠాల్ని
పాఠం ఇచ్చిన అనుభవాల్ని
అనుభవాలు మిగిల్చిన చేదు జ్ఞాపకాల్ని
చల్లని నీ చూపుతో
వెచ్చని నీ చిరునవ్వుతో
నీ చిలిపి మాటలతో
నా అని  చెప్పుకునే వాళ్లు లేని నాకు
నేనున్నానని నీకున్ననాని నీతో ఉంటానని అనుకోని అతిధి లా నా జీవితంలోకి వచ్చిన అల్లరి నేస్తానివో!
కష్టాల సమ్మెట పొట్లతో బండ బారిన గుండెను
ఇష్టాల తోట పువ్వుల సున్నితత్వం తో
కన్నీరు నీరు ఎండిన బావుల ఎండ మావిలో
కడివెడు పన్నీరులా
వేర్లు తెగిన కలలకు కొత్త చిరుగులా
యుగాల శిశిరాన్ని దాటి క్షణాల్లో వచ్చిన వసంతంలా
అచ్చమైన మోసాల మసితో మాసిన మనసుని
స్వచ్చమైన తెల్లని పసి నవ్వులతో
రాయిని రత్నం చేసిన నువ్వే నాకు
ఊహించని వరనివి
కాళ్ళు విరిగి చేతులు తెగి నేలపై  కోన ప్రాణంతో కొట్టుకుంటున్న తుమ్మెదకు నీ మెత్తని నీ చేతుల స్పర్శతో ప్రాణం పోసిన
దీవి నుండి భువికి దిగివచ్చిన రెక్కల చందమామ
చెప్పకుండా తెలిసేది ఎలా నీ చిరునామా???

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!