అల్లరి బహుమతి

(అంశం : నా అల్లరి నేస్తం)                                                                      అల్లరి బహుమతి

రచన :: ప్రతిభ

పుట్టింటిని వదిలి
మెట్టింటిని చేరి
అత్తవారి ఆదరణ కరువై
ఒంటరి తనానికి చేరువై మోడువారిన జీవితానికి
ఎడారిలో తొలకరి చినుకులా
నా బొజ్జలో పడిన చిట్టి విత్తనానివి
నా ఆనందానికి ఆశా దీపానివి
నీ చిరు నవ్వులు
నీ చిన్ని అల్లర్లు
మరిపించాయి బాధలు
రెపాయి రేపటి పై ఆశలు
ఓ అపురూప బహుమతీ
నీకిదే నా మొదటి బహుమతి

***

You May Also Like

4 thoughts on “అల్లరి బహుమతి

  1. ఎదురు చూసే నీ జ్ఞాపకాలు కై
    ఇక రావని తెలిసిన.
    అలుపెరుగని నా ఈ చిన్ని ఆవేదన నీకై ఎదురు చూస్తుంది

    1. చంపేయాలని ఉంది ఈ మనసుని

      ప్రేమ అంటూ గతాన్ని పట్టి వేలాడుతోంది.
      మూర్ఖంగా జ్ఞాపకాలను మరువను అంటుంది.
      కదలని కాలంలో
      వసంతానికై ఎదురు చూస్తుంది.
      తరగని ఆవేదనతో
      ఆనందం ఎక్కడని వెతుకుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!