హత్తుకో

హత్తుకో

రచన: సుశీల రమేష్

అన్యోన్యతను సూచించడానికి
ఇద్దరు మిత్రులు హత్తుకున్న చో
వారి మైత్రీ బలపడు ను కదా!
బాధలో ఉన్న వారిని హత్తుకున్న చో
వారి మనసుకు ఊరట లభించును కదా!
రక్త సంబంధీకుల లో అనుబంధం
ఆప్యాయత వెల్లివిరియును కదా!
ప్రేయసీ ప్రియులు హత్తుకున్న చో
వారి మనసుల కలయిక గుర్తుకే కదా
దంపతులు హత్తుకున్నచో అది
వారి రసజ్ఞత కే దారితీయును కదా.
ఎదురుపడే మదనుడి తో
వరస కలపాలంటే హత్తుకోవాలి కదా!
హత్తుకున్న మదనుడి చిలిపి చేష్టలకు తీయని తాపానికి లోనైన
ఆలి మనసుకు బలము చేకూర్చును కదా!

*********

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!