తల్లి భాష తల్లడిల్లింది
రచన: శిరీష వూటూరి
తరతరాల చరిత్ర కలిగిన
తల్లి భాష నేడు
తల్లడిల్లింది
అన్ని భాషలను
అక్కున చేర్చుకున్న
అలనాటి మేటి భాష
తన ఉనికిని నిలిపమని
అర్థిస్తోంది
ఎన్ని భాషలు నేర్చినా
దెబ్బ తగిలితే” అమ్మ”
అని మన భాషలోనే
బాధపడతాం,
ఉగ్గు పాల భాష
మాట్లాడడానికి
సిగ్గు ఎందుకు
మన మాతృభాషను
మనసులో నిలుపుకొని
తనివి తీరా మాట్లాడుదాం
పొట్ట కూటికోసం పరాయి
భాషలు నేర్చుకున్నా
వేదపురాణాల తెలుగోడి
భాషే దిట్ట యని వేనోళ్ళ పొగుడుదాం
తెలుగుభాషను రక్షించుకుందాం…..