జ్ఞానదీప్తి గురువు

జ్ఞానదీప్తి గురువు

రచన: చెళ్ళపిళ్ళ సుజాత

చాణుక్యుని చేతిలో రూపుదిద్దుకున్న
శిల్పం…చంద్రగుప్త మౌర్యుడు
సమర్ధ రామదాసు తయారు చేసిన వీర ఖడ్గం …శివాజీ
రామకృష్ణ పరమహంస అందించిన ఆధ్యాత్మిక శిఖరం …వివేకానంద
భారతీయ గురు శిష్య శక్తికి గొప్ప ఉదాహరణ లు
అజ్ఞానాంధకారాన్ని తొలగించి
జ్ఞానకాంతులను ప్రసాదించే జ్ఞానదీప్తి గురువు
ఆదిదేవునితో మొదలైన గురుపరంపర
వేదవ్యాసునితో సుసంపన్నమయి
సనాతన ధర్మాన్ని పరంపరగతంగా రక్షిస్తున్న
సాక్షాత్తు పరమశివుని అంశఅయిన
ఆదిశంకరాచార్యులు తెలిపిన రజ్జుసర్పభ్రాంతిలా
అజ్ఞానం అనేది చీకటిలో తాడుని చూసి పామని భ్రమింపజేస్తుంది
కనుక అజ్ఞాన పొరలు తొలగించి జ్ఞానకాంతులను
అందించడమే గురువు యొక్క పరమ ధర్మమన్న మాట అక్షర సత్యం కదా
అందుకే…
స్వస్తినా బృహస్పతిర్ధధాతు…అను గురువును స్మరిస్తోంది అధర్వణ వేదం….

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!