(అంశం:”బానిససంకెళ్లు”)
సామాన్యుడే సైనికుడు
రచన: ఐశ్వర్య రెడ్డి గంట
రాజులు పోయే రాజ్యాలు పోయే
కత్తులు కటారులతో భయపెట్టి
గెలిచె కాలమొచ్చే
సామాన్య జనులను బానిసలు గాఎంచి
సంకెళ్ళతో పాలిస్తున్న వేళ
అక్రమార్కులు చేసే అన్యాయాలకు
అవినీతి పరుల ఆదర్శాలకు
బలికాక తెంచుకో బానిస సంకెళ్లు నువ్వు ,
రాక్షస మూకల దారుణాలకు
బలి అయిన బాధితుల ఆత్మఘోషలే
అగ్నిశిఖలై కాల్చేస్తూంటే
తెంచుకో బానిస సంకెళ్ళు నువ్వు
రాజకీయాల రంగులు మారుతుంటే
అధోగతిన నాదేశం అంధకారం అవుతుంటే వెలుగు కోసం పోరాడే సూర్యునివై
తెంచుకో బానిస సంకెళ్ళు నువ్వు
మార్పు కోసం మూకుమ్మడిగా ఉద్యమిస్తూ లంచగొండుల పాలన నశించాలంటూ
ఎలుగెత్తి చాటుతూ తెంచుకో
బానిస సంకెళ్లు నువ్వు
నల్లదనం నడ్డి విరగోట్టి
స్వచ్ఛమైన పాలన కావాలంటూ
కట్టలు తెంచుకున్న కోపంతో
సామాన్యుడే సైనికుడై
గర్జిస్తున్న వేళ తెంచుకో బానిస సంకెళ్లు నువ్వు.