జ్ఞాపకాలు

 జ్ఞాపకాలు

రచయిత: కిరణ్ తేజ

సమయం గడిచిపోతుంది రోజు వచ్చే లక్ష్మి ఈ రోజు ఇటుగా రాలేదే ? నేను లేచే సమయానికి తను వస్తుందా! తను వచ్చే సమయానికి నేను లేస్తానో! తెలిదు కానీ!
తను వచ్చే సమయం నేను లేచి బయటకు వచ్చే సమయం ఒకటే. తను ఇలా మా ఇంటి ముందు నుంచి, నన్ను ఓరగా చూస్తూ మా వీధి చివరన ఉన్న చిల్లరకొట్టు కి వెళ్లి ఏదో ఒకటి కొనుక్కొని వస్తుంది. అదేమిటో వాళ్ళు నెలకి సరిపడా సరుకులు సిటీ నుంచి తెచ్చుకుంటారు. అలానే వారానికి సరిపడా కూరగాయలు కూడా తెచ్చుకుంటారు. అయిన సరే తను రోజు నాలుగు సార్లు మా ఇంటి ముందు నుంచి ఆ చిల్లర కొట్టు కి వెళ్ళటం మానదు. ఆ వెళ్ళేటప్పుడు ఓరగా మా ఇంటిలోకి చూడకుండా వెళ్ళదు.
అయితే! ఆ కొట్టు కి వెళ్ళాలి అంటే వాళ్ళ ఇంటి నుండి మరో దారి ఉంది. ఆ దారిలో అయితే త్వరగా వెళ్లి రావచ్చు. కానీ ఇదే దారిలో వస్తుంది ఏమిటో! ఆ చిల్లర కొట్టు మా ఇంటికి చాలా దగ్గరగా ఉంటుంది. ఆమె అక్కడకి వెళ్లి మళ్ళీ తిరిగి వచ్చే వరకు నేను గమణిస్తాను.
తను అక్కడికి వెళ్లి నా! అందులో ఉన్న వ్యక్తి తో మాట్లాడుతూ నా వైపు  ఒరకంట చూస్తుంది. ఆ ఒరకంట చూడటం ఏమిటో కానీ భలే చూస్తుంది.అలా చూసినప్పుడు ఆమె పెదవుల పై నవ్వు. ఆ నవ్వు నీ చూస్తే ఎవరికైనా ప్రశాంతంగా ఉంటుంది. ఆమె ఇప్పటివరకు నేరుగా నా వైపు చూడలేదు. ఎప్పుడు అలానే ఒక పక్కాగా చూసేది . నాతో ఏమైనా అవసరం పడి మాట్లాడవలసి వచ్చిన కూడా  తల దించుకుని లేదా అటు ఇటు చూస్తూ మాట్లాడేది.నేను నేరుగా తననే చూస్తుంటే ఎంత ఇబ్బంది పడేదో చిన్నగా వనికేది కూడా. తనని అలా చూస్తే భలే తమాషాగా ఉండేది నాకు.
తను ఎందుకు ఇలా వచ్చేది! ఎందుకు నన్ను అలా చూసేది! అనే విషయం మొన్ననే ఒక పది రోజుల క్రితం తెలిసింది.
ఎలా అంటే అప్పుడే ఆమె పెళ్లి కుదిరింది. అలా ఎందుకు చూసేది అంటే! ఆమె నన్ను ప్రేమిస్తుంది. ఆమె నన్ను ఇష్టపడుతుంది, అని నాకు తెలుసు ఆమె ప్రవర్తన వలన. ఆమె అలా చూస్తే నాకు కూడా బాగుండేది. కానీ ప్రేమ అంటేనే నాకు ఎందుకో మనసు ఒప్పుకోలేదు. బహుశా తన ప్రేమ నీ నేను భరించలేను ఏమో అనిపించింది . తన కళ్ళలో ఉండే అమాయకత్వం నా వల్ల కాదు ఏమో అనిపించింది . తన నిరక్షరాస్యత నాకు చిన్నతనం అనిపించింది ఏమో! తన అందవిహీనం నాకు ఆటంకం ఏమో అనిపించింది! అసలు ఆమె ప్రేమ కి నేను సరికాదు ఏమో అనిపించింది. ఎందుకు అలా అనిపించిందో, నాకు తెలీదు కానీ! అనిపించింది. అందుకే ఆమె నీ వదిలేసుకున్న .నేను వదిలేసాను కానీ, ఆమె కూడా వదిలేస్తుంది అనుకోలేదు .
అసలు అంతలా ప్రేమించింది అంటేనే నా రోమాలు నిక్కపొడుచుకుంటున్నాయి.
అవును! ఆమె నన్ను వదిలేసింది పూర్తిగా. మొన్న నే తన పెళ్లి అయిందిపెళ్లి అయితే వదిలేసే ప్రేమా!  తనది  కాదే! అందుకే ఏమో నిన్ననే ఈ లోకాన్ని వదిలింది.
ఈ రోజు నాకు జ్ఞాపకం అయి నిలిచింది .
నేను వద్దు అంటే మరొకరితో జీవితం కూడా వద్దు అనుకున్నట్లు ఉంది! తన ప్రాణం తనే తీసుకునే అంత కసాయిది అయిపోయింది. తన మదిలో నా ముద్ర చేరగను అన్నది ఏమో! కాళ్ళ పారాని చేరగకముందే తన జీవితాన్ని అర్ధం లేని నా కోసం  వదిలేసింది!
ఇక ఈ రోజు నుంచి ఆమె జ్ఞాపకాలతో నేను రోజు కాలిపోతూ ఉండాలి ఏమో!
రెండు జడలు వేసుకున్న ప్రతి పడుచు పిల్లల్లో ఆమె కనిపిస్తుంది నాకు.
ఈ వీధి అంత తన అడుగుల చప్పుడే. ఆ వీధి చివర చిల్లర కొట్టు దగ్గర తన ఓరచూపులే ఇవే కనిపిస్తాయి ఏమో!
అంతలా ప్రేమించే ఆమెని వదులుకున్న నేను ఎంత దూరదృష్టవంతుడినో!
తనని నేను వదిలేస్తే, నన్ను తను వదిలేసి, తన జీవితాన్ని వదిలేసి, ఈ ప్రపంచాన్నే వదిలేసి వెళ్ళిపోయి నాకు ఇంత శిక్ష నీ విధించిన ఆమె పై నాకు ఉండాల్సింది , ప్రేమాభిమానం ఆ! లేదంటే నామీద నాకే కోపం వచ్చేలా చేసినందుకు తనపై అంతులేని కోపమా! కోపమో ప్రేమో నేను తనని జీవితాంతం మర్చిపోలేని శిక్ష వేసాయి  ……..

***

You May Also Like

One thought on “జ్ఞాపకాలు

  1. This story like cinema story..
    Read చేస్తుంటే నిజ జీవితమైన పాత్రలోకి వెళ్లినట్లు అనిపించింది…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!