మనిషి జీవనం

(అంశం:”బానిససంకెళ్లు”)

మనిషి జీవనం

రచన: కవితదాస్యం

బానిసత్వానికి అలవాటు పడ్డవాడు తనబలం తాను గుర్తించడు…
మనిషే మనిషికి బానిస..
అవసరార్థం మనిషి కదా…
మనిషి ఎప్పుడు బానిసే …
కాసుల కోరడాలకి…
ధనరాశుల బేడీలకి..
మనిషి ఎప్పుడు బానిసే…
విశ్రమ జీవితానికి…
నాలుగంకెల కాగితానికి…
భరిస్తుందని బానిస అనకు..
భరించగలిగేంత ప్రేమ ఉందని అర్థం చేసుకో..
ఎదురుతిరిగిందంటే తెగించిందని అర్థం చేసుకోకు…
పెదవి సంకెలు విప్పినదని నిర్ధారించుకో…
పంజరంలో చిలకలా ఉండి ఉండి..
స్వేచ్ఛ ఎగురలేక బందీ అయ్యే ప్రమాదం లేకపోలేదు…
నా ఆశలకు స్వేచ్ఛ ఉన్న…
నా ఊపిరికి స్వేచ్ఛ ఉన్న..
నా గమనానికి స్వేచ్ఛ ఉన్న..
నాఆలోచనలకు…
నాకై రాసుకొనే అక్షరాలకు అప్పటికీ ఇప్పటికీ బానిస ని…
స్వేచ్ఛా స్వాతంత్రాలు అంటే…
బానిస కళ్లు మెరుస్తూ మురిసిపోవడం…

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!