హాస్య వల్లరి

(అంశం:హాస్యకథలు)

హాస్య వల్లరి

-నారుమంచి వాణి ప్రభాకరి

సూర్యుడి తో పాటు చదువు పరుగు మొదలు ఇంట్లో ఊరే బద్రీ చదువు లేక పోతే జీవితం లేదు రా మంచి ఉద్యోగం రాదు.మంచి సంపాదన లేకపోతే మంచి పెళ్ళాం కూడా రాదు.వెర్రి వేషాలు మాని శ్రద్ద గా కాలేజి కి వెళ్లి అక్కడ ఎవరితోనూ తంటాలు తేకుండ చదువుకుని రా అని నాన్న రమణ తాత జగన్నాథ రావు హెచ్చరిస్తూ ఉండేవారు,.

బద్రి మంచి తెలివైన వాడు. కానీ వెటకారం వెక్కి రింతలు ఎక్కువ , బద్రీ స్నేహితుల్ని బంధువుల్ని ఆట పట్టిస్తూ ఉండేవాడు.
తల్లి పూర్ణ ఎప్పుడు హెచ్చరించేది హాస్యం వల్ల మనసుకి ఆనందం రావాలి కానీ వాళ్ళ మనసు గాయ పడకూడదు అని చెప్పేది

ఒక సారి చుట్టాలింట్లో ఫంక్షన్ అయింది అందరికీ అందుబాటులో అన్ని ఉన్నాయి కనుక చక్కగా వంటకాలు బాగా చేయించింది. వరుసకి బద్రికి పెద్దమ్మ కూతురు అవుతుంది పిల్లాడు పుట్టిన రోజు అని ఉల్లి గారెలు గులాబ్ జామ్  పుల్కాలు బిర్యాని ఐస్ క్రీమ్  అరటి పళ్ళు కొబ్బరి పచ్చడి అల్లం పచ్చడి రెండు చేశారు ఇలా తెగలు బుర్ర గుంజు కమలాలు జామ మొదలైనవి అన్ని పెట్టారు.

ఎవరికి కావలసినవి వారు పెట్టించుకుని తింటున్నారు..

ఎందుకంటే కార్తీక మాసం లో పుట్టిన రోజు కనుక టెర్రస్ పై రూఫ్ గార్డెన్ లా ఉంటుంది వాళ్ళ ఇల్లు ఎంతో బాగా అలంకరించి ఉంచుతారు.

మెడ పై కి బయట మెట్లు ఉన్నాయి అతిథులు అలా వస్తారు బద్రీ కి వరసకి అక్క అవుతుంది ఆ ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా బద్రీ హడావుడి ఉంటుంది

బద్రీ మిమిక్రీ నేర్చు కోవడానికి ఈ రూప అక్క కారణం అని చెప్పాలి నువ్వు హాస్యం లో బ్రతుకు తావు కొంచెం మిమిక్రీ నేర్చుకో అన్ని ఎంతో ప్రో స్తాహం ఇచ్చేది. అలా బద్రీ కుక్క అరుపులు విమానం స్కూటర్ సౌండ్ కార్ స్టార్టింగ్ సినిమా నటుల అనుకరణ నేర్చుకున్నాడు క్యాసెట్లు పెట్టుకుని వాళ్ళ మాదిరి అనుకరించే వాడు

ఏ విద్య అయిన సిన్సియర్ గా నేర్చుకుంటే జీవితంలో గుర్తింపు వస్తుంది అని రూప  చెప్పేది

ఇంకేమీ బద్రీ విన్నాడు కారణం అక్కదగ్గర అందమైన కూతురు ఉన్నది అది కూడా ప్లస్ పాయి

బద్రీ రారా ఇంత ఆలస్యంగా గా వచ్చావు నీకు గారెలు అంటే ఇష్టం కదా ముందు తిను అన్నది..
పచ్చడి వేసి పెట్టనా అన్నది.

ఏమిటి ? అక్క పచ్చడి నా జేబులో ఉన్నదా అన్నాడు

అదేమిటి రా ఉల్లి గారెలు కదా పచ్చడి వేసుకుంటా వో లేదో అని అన్నది .

అబ్బే నా జేబులో పచ్చడి పెట్టుకు రాలేదు
నువ్వు గారెలతో పాటు వెయ్యి
ఈ సారి ఫంక్షన్ కి వచ్చే ట ప్పు డు పచ్చడి డబ్బా జేబులో పెట్టుకుని వస్తాను

మీ ఇంటికి అయితే జాడి కార్లో పెట్టీ తెస్తాను మళ్లీ జాడి తిరిగి ఇయ్యి మా బామ్మ కేకలు వేస్తూ అరుస్తుంది అన్నాడు

బద్రీ అందుకే రా నిన్ను హాస్య గాడు అంటారు మిమిక్రీ నేర్చుకో మన్నది.

పైన అతిథులు ఉన్నారు తొందరగా తిని కార్య క్రమం స్టార్ట్ చెయ్యి అన్నది

బద్రీ గబ గబ గారెలు మింగి నీళ్ళు తాగి పై కి పరుగెత్తాడు
ఐస్ క్రీమ్ కప్పు చేతితో పట్టుకుని.  వెడుతునే మైకే తీసుకుని హడావుడి చేశాడు

అందరూ బద్రీ మిమిక్రీ మెచ్చుకున్నారు

జీవితంలో హాస్యం పెట్టుబడి లేని ఔషదం నవ్వే శక్తి ఒక్క మానవుడికి ఉన్నది.

అందుకే హాయిగా నవ్వితే ఆనందం వస్తుంది నవ్వండి
పై సా పెట్టు బడి లేని మందు.
విందు ఒక ప్రక్క హాస్య వల్లరి
మరో ప్రక్క మందు అంటే వేరే ఊహల్లో కి వెళ్లకండి అన్నిటికన్నా చాలా హుషారుగా ఇచ్చే మందు ఈ హాస్యం అంటూ ఎన్నో రకాల
మిమిక్రీ చేశాడు పూర్వపు హాస్య గాళ్ళు అందరినీ కూడా
పరిచయం చేశాడు …

బద్రీ మంచి కార్య క్రమం చేశాడు అంటూ రూప మెచ్చుకున్న ది వచ్చిన వాళ్ళు కూడా మెచ్చుకున్నారు

ఇలా నవ్వు నాలుగు విధాల అందము అని చెప్పాడు హాస్యం అందరికీ రాదు కొదత్ కే పరిమితము హాస్యం అపహాస్యం కాకుండా మంచి ధోరణిలో ఉంటే అదే జీవిత పురోగమనం కూడా

బద్రీ కాలేజ్ లో హీరో అయ్యాడు ఒక సారి కాలేజిలో  ప్రో గ్రామ్ కి సినీ డైరెక్టర్ అతిథి గా వచ్చినప్పుడు మిమిక్రీ విన్నా డు
ఆయన మెచ్చుకుని మేము తియ్య బోయే చిత్రం లో కమెడియన్ హీరోని నూతన పరిచయం చెయ్యాలని ఉంది నిన్ను సెలెక్ట్ చేసాను అని అడ్రెస్స్ కార్డ్ ఇచ్చాడు

ఇంకేముంది బద్రీ ఆనందం పగ్గాలు లేకుండా పోయింది

కానీ ఇంట్లో తాత తండ్రి కేక లేశారు చదువుకో రా అంటే సినిమాల్లో చేరు తావా అని బాగా చివాట్లు వేశారు

బద్రీ ఇసారికి వప్పు కోమని చెప్పు అని రూప అక్కని బ్రతి మా లాడు
సరే అని చెప్పింది

కానీ వీడికి చదువు లేకుండా సినిమా అంటే ఎవరు పిల్లని ఇస్తారు ? అని కేక లేసారు
పెద్ద వాళ్ళకి నచ్చని పని ఎదో చదువుకుని నాలుగు రాళ్లు సంపాదిస్తే పిల్ల నిస్తారు అసలే ఈ రోజుల్లో మగ పిల్లాడి పెళ్లి బహు కష్ట ము  అన్నారు .

బద్రీ మళ్లీ మళ్లీ పట్టు బట్టాడు కాలేజి ప్రిన్సిపాల్ లెక్చరర్స్ చేత చెప్పించి ఎలాగో ఆ సినిమా పూర్తి చేశాడు

చదువు ఆపకుండా డిగ్రీ పూర్తి చేశాడు కాలేజి ఇమేజ్ పెరిగింది
ఐదు అరు సినిమాల్లో బుక్ అయ్యాడు .కొన్ని సంస్థలకి చారిటీ కార్య క్రమాలు చేసేవాడు దానితో మరీ పాపులారిటీ వచ్చింది

మరో ప్రక్క ఎం బి ఎ కూడా చదివాడు.

పెళ్లి చెయ్యాలని ఇంట్లో పట్టు పెట్టారు నువ్వు ఎవర్ని ప్రేమచ కూడదు అని తాత కేక లేసాడు
సరే తాత మీ ఇష్ట ప్రకారమే సంప్రదాయ కుటుంబం పిల్లని చూడండి అన్నాడు కొన్ని వాళ్ళకి కుదరక మరికొన్ని వీళ్ళకి నచ్చి క జరగ లేదు
ఎవరికి ఎవరు రాశారో వాళ్ళు అవుతారు

అలా రుపక్క కూతురు నీ అడిగితే సరి అన్నాడు
అదే మాట రూప తో అంటే నువ్వు ఎప్పుడు బాగా ఎది
గావు కదా నేను సరి పోతానా
అన్నది
అదేమిటి అక్క నువ్వు చెప్పి నన్ను గొప్ప హాస్య చక్రవర్తిని చేశావు నీ కంటే నాకు ఎక్కువ ఎవరూ? అంటూ నవ్వాడు

సరే సినిమా స్టార్ నా అల్లుడు అంటే ఇంత కన్నా గొప్ప అదృష్టం ఏమిటి అని రూప అన్నది  పిడి కిట తలంబ్రాల పెళ్ళికూతురు శ్రీ అన్నమయ్య శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తన సెల్ ఫోన్ రింగ్ టోన్ శుభ సూచకంగా మ్రోగింది .
శుభమ్

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!