చికాకులచిదంబరం

(అంశం:హాస్యకథలు)

చికాకులచిదంబరం

రచన: దోసపాటి వెంకటరామచంద్రరావు

‌చిదంబరం పక్కింటి పంకజాన్ని పాతికేళ్ళక్రితం‌ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. పంకజం కూడ చిదంబరాన్ని ప్రేమించింది. పెళ్ళైనకొత్తలొ చిదంబరం పంకజంల దాంపత్యం అనురాగమయం.అనందభరితం. చిదంబరం ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తుండేవాడు. పంకజం ఎప్పుడు పకపకనవ్వుతుండేది. చిలకాగొరింకల్లా అందరికి ఆదర్శంగా ఉండేవారు. పిల్లలు పుట్టడంతో కొంచెం వారిద్దరికి ఎడపాటు ఏర్పడసాగింది. పంకజానికి చిదంబరం మీదకంటే పిల్లలమీద శ్రద్ద ఎక్కువయ్యింది. అదిగో అప్పుడే చిదంబరం చికాకుల చిదంబరమైపోయాడు.
పంకజం పరాకుల పంకజమైపోయింది. ప్రతిరోజు ఇంటిలో చిదంబరం చిర్రుబుర్రులెక్కువయిపోయాయి.
పంకజానికి ఏమిచెయ్యాలో తోచేదికాదు. ఫోనులో పిల్లలకు చెప్పుకొవడం ఒక్కటే ఆమెకు ఊరట. ఇలా సాగుతన్న వారి సంసారంలో చిదంబరం రిటైర్మెంటు అయ్యింది. ఇక చిదంబరం చికాకులచిందులు ఎక్కవయ్యాయి.
“ఏమేవ్!నా కళ్ళజోడెక్కడ పెట్టావ్.నా గళ్ళచొక్కా కనపడటంలేదేమిటి.ఆ వాషింగ్మెషిన్ లో పడేశావా? నా క్యాష్బేగు ఎక్కడ తగలెట్టేవ్.”ఊపిరితీసుకోకుండా
సాధింపులు మొదలు పెట్టేశాడు చిదంబరం. “అదిగో ఆ అలమారలో రెండవ అరలోనే మీ గళ్ళచొక్కా వుంటుంది.ఆలాకర్ లోనే మీ క్యాష్భేగు వుటుంది.కళ్ళజోడు ఆ టేబిలు సొరుగులో వుంటుంది.రోజు పెట్టినచోటే పెడుతుంటారుకదా!మళ్ళీ ఈ హడావుడెందుకు?”పంకజం సమాధానం చెప్పింది.
“అంతేగాని తీసి చేతికివ్వడం తెలీదా?సరే ఆ టిఫిన్ ఎదో ఇంత తగలేస్తే తినేసి అలా ఆఫీసుకెళ్ళి నా పెన్షన్ కాగితాలు ఆఫిసర్ మహానుభావుడికి సమర్పించుకోవాలి.త్వరగా తగలబడు”మళ్ళీ
చిదంబరం చిందులు.
“మహానుభావా!అదిగో ఆ టేబుల్ పైన పెట్టాను తిని నన్ను ధన్యురాలిని చెయ్యండి.”పంకజం కూడా భర్తను అనుకరిస్తూ జవాబిచ్చింది.
“ఏమేవ్!నీక్కూడ తిక్కగావుందా.సరిగ్గా సమాధానం చెప్పి చావవేం”మళ్ళి చిదంబరం ఆరంభించాడు.
ఇక రోజు ఇదేతంతూ సాగకతప్పదకాబోలు.పెద్దవాడిదగ్గరకో ,చిన్నదాని దగ్గరకో ఓ నెలరోజులు పాటు చెక్కేస్తేగాని ఈయన చిందులు తప్పేలా లేవనుకుంది పంకజం. చిదంబరం టిఫిన్ తినేసి వెళ్ళిపోగానే పెద్దవాడికి ఫోనుచేసి చెప్పింది టిక్కెట్టు తీసుకోమని.అప్పటికిగాని పంకజానికి మనసు ఊరటచెందలేదు. ఇదండి చికాకులచిదంబరం సంగతి!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!