వైకుంఠంలో గందరగోళం

(అంశం:హాస్యకథలు)

వైకుంఠంలో గందరగోళం

రచన : కందర్ప మూర్తి

        వైకుంఠంలో  గందరగోళం వైకుంఠంలో అత్యవసరంగా త్రిమూర్తులు  బ్రహ్మ  విష్ణు మహేశ్వరుడితో  పాటు  దేవేంద్రుడు మిగతా దేవతా గణం , నవగ్రహాలు , పంచభూతాలు  సమావేశ మయారు.

        భూమండలం నుంచి మన  దేవతలకు  అందవల్సిన ఫలహారాలు , అర్చనలు , అభిషేకాలు , యజ్ఞ యాగాదులు , కల్యాణ మహోత్సవాలు , సంప్రదాయ  బద్ధంగా  ఆగమ
పూజా  కార్యక్రమాలు  సక్రమంగా  జరగక  ఆకలితో అలమటిస్తున్నామని  దేవతలు  వాపోతున్నారు.

   దానికి కారణం భూలోకంలో కరోనా అనే మహమ్మారి వ్యాపించి మానవులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోందట. భూమండలం మీద దేశాలన్నిటినీ  ఈ భయంకర రోగం గత  కొన్ని  మాసాల నుంచి వయసు  పైబడిన  ముసలి వారిని, రోగిష్టులను , పసి వారినీ రోజులలో  కబళిస్తోందని  మన  శని దేవత కన్న భయంకరంగా తయారైందని  సభలో  చర్చనీయాంశమైంది.

       కరోనా  మరణాల వల్ల  జీవుల  రాక   వత్తిడి ఎక్కువై  యమలోకంలో  స్థలాభావం , పనిభారంతో  యమకింకర సిబ్బంది  ఇబ్బంది  పడుతున్నారని  దీనికి  పరిష్కారం
చూపాలని  యమధర్మరాజు  గారి  మొర.

     ఈ కరోనా మహమ్మారి  కారణంగా  భూలోక  మానవ కరేబరాలను ఖననం చేయుట  కష్టమని గంగానదీ ప్రవాహంలో పడవేస్తు జలాలను దుర్ఘంధ పూరితంగా కాలుష్యం చేస్తున్నట్టు
గంగామాయి   శివునికి  మొర  పెట్టుకుంది.

    ఈ భయంకర రోగం వైరస్ రూపంలో గాలి ద్వారా, మనుషుల నోరు  ముక్కుల నుంచి  కంఠంలో ఉండి  తుమ్మినా మాట్లాడినా చేతులు  కలిపినా  ఒకరి  నుంచి  మరొకరికి  వ్యాపిస్తోందట.

  అందువల్ల  మానవుని చూసి మానవుడు భయపడి  దూరంగా మసులు తున్నారట. మూతికి  మాస్కులు అనే గుడ్డ పీలికలు , చేతికి  శానిటైజర్  అనే  రసాయన ద్రవం  పూసుకుంటూ
సామాజిక  దూరం పాటిస్తూ రోజులు వెళ్ల దీస్తున్నారట.

      భూలోక శాస్త్రవేత్తలు ఈ కరోనా వైరస్ మహమ్మారి  కట్టడికి ఎంతో కృషి  చేస్తు  అనేక  నామాలతో  ద్రవ రూపంలో తయారు చేస్తు దాన్ని సూదుల ద్వారా మనిషి శరీరంలో పంపుతున్నారట.

        భూ ప్రపంచ  దేశాలన్నింట  ఆర్థిక  సంక్షోభం ఏర్పడి విధ్య  వైధ్య  వ్యాపార వాణిజ్య  పర్యాటక  ఆహార  ఉత్పత్తి  రంగాలతో పాటు  ఆధ్యాత్మికంగాను ప్రభావం కనబడుతోంది.

      భూలోక  దేవాలయాలు  ప్రార్థనా మందిరాలు  ఇలా దైవ కార్యాలకు  ఆటంకం  ఏర్పడుతోంది.  భక్తులు  లేకుండానే దేవుళ్ల  వేడుకలు  జరుగుతున్నాయి. దేవాలయాలకు  భక్తుల
కొరత  కారణంగా  ఆదాయం  లేక  ఆర్థికంగా  ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ కరోనా  మహమ్మారి  వల్ల  గుళ్లలో ఆధ్యాత్మిక  కార్యక్రమాలు  లేక  కళ  తప్పుతున్నాయి.

   విధ్యాలయాలు మూత పడ్డాయి. వ్యాపార  వాణిజ్య కేంద్రాలు  తెరవడం లేదు.వైద్య శాలలు  రోగులతో రద్దీ గా కనబడతున్నాయి.  వినోద   సాంస్కృతక  సంస్థలు  మూసుకున్నాయి. రోజు వారి  పనులతో  కడుపు  నింపుకునే బడుగు బలహీన  వర్గ  ప్రజల కష్టాలు  వర్ణనాతీతం.” ఇలా భూలోక సంచారి నారదుడు  కరోనా వైరస్ కష్టాలు చెబుతూంటే  సభలో అందరూ  చెవులు  రిక్కించి  వింటున్నారు.

    నవగ్రహాలు  ఏక కంఠంతో  భూలోక  మానవుడు  దైవాంశ సంభూతుడై  మన గ్రహాల్నే ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నా డని  ఫిర్యాదు  చేసాయి.

  పంచభూతాలు కూడా  బ్రహ్మదేవుల వారు సృష్టించిన ఆధునిక మానవుడు  తమనే  చెప్పుచేతల్లో ఉంచడానికి ప్రయత్నిస్తున్నా యని , అనేక  అంతరిక్ష  వాహనాల  రణగొణ  శబ్దాలతో
ప్రశాంతత  లేకుండా  పోతోందని  వాపోయాయి.

   పురాణ కాల  రాక్షస రాజుల కన్న నేటి మానవుడికి  దేవతలు, గ్రహాలు  భయపడవల్సిన  రోజులు  వచ్చాయని  మదన పడుతున్నారు.

      చివరగా  విష్ణుమూర్తి  లేచి అందరికీ అభయమిస్తూ, “ఇది కలికాలం  నడుస్తోంది.  మానవుడు ఆధ్యాత్మిక మార్గం  వదిలి పాప కూపం  వైపు  పయనిస్తున్నాడు. అందువల్ల  వినాశ
బుద్ధులే  పుడతాయి.  తన వేలితో  తన కంటినే  పొడుచుకునే రోజులు  వస్తాయి. ఇప్పుడు  జరుగుతున్నదంతా  మానవ తప్పిదం. మరేమీ  ఆందోళన  పడకండి , అన్నీ సర్దుకుంటాయి”
దైర్యం  చెప్పారు.

       గణేష్  నవరాత్రులకు పార్వతీదేవి గణపతిని భూలోకానికి పంపలేదు. శ్రీ రామ నవమి   కృష్ణాష్టమి   మలయప్ప వేంకటేశ్వరుని  కల్యాణ వేడుకలు ఇలా అంతటా ఆధ్యాత్మిక వేడుకలు
నియమ  నిబంధనలతో   జరుగుతున్నాయి.
మరెప్పుడు  మానవాళి సుఖంగా ఉంటుందో కాలమే చెప్పాలి.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!