నేరము-శిక్ష

నేరము-శిక్ష
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: బాలపద్మం

ఏ వార్తా పత్రిక తిప్పినా
ఏ టీవీ చానెల్ పెట్టినా
ఘోరమైన నేరాలే
భ్రూణ హత్యలు పరువు హింసలు
వావి వరుసలు మరచిన
నర రూప దానవ కృత్యాలు
హద్దే లేని దుర్ఘటనలు
హృదయ విదారక దృశ్యాలు
కారణమేమిటి?
తరగని విచారణలు
తేలని నిజాలు
భయమెరుగని నేరగాళ్లు
వికృత కృత్యాలు ఆగాలంటే
సత్వర న్యాయం జరగాలి
నేర తీవ్రతను పరిగణించి
గ్రామ, మండల, జిల్లా
రాష్ట్ర లేదా దేశ స్థాయిలో
శిక్షలు అమలు జరగాలి
వాటికి మించి
ఇంటి నుంచే సభ్యత నేర్వాలి!
మానవత్వం బట్ట కట్టాలి!

You May Also Like

8 thoughts on “నేరము-శిక్ష

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!