నా కోరిక

* నా కోరిక *

    అదొక బహుళజాతి కంపెనీ ఐదంకెల జీత గాడు రమణ, ఈ మధ్యనే పెళ్లి అయింది భార్య పేరు రమ. రమణ సొంత ఊరు గుడివాడ. ప్రస్తుతం ఉన్నది హైదరాబాద్. తండ్రి పేరు రాఘవయ్య,. తల్లి లక్ష్మి.

ఈ మధ్య ఎందుకో ఉదాసీనంగా ఉంటున్నా రమణ ను సహోద్యోగి ప్రశాంత్ పలకరించి, ఏంటి రమణ ఈమధ్య ఎందుకు ఏదో కోల్పోయిన వాడిలా ముభావంగా ఉంటున్నావు, పైగా కొత్త పెళ్ళికొడుకు వి కూడా, ఏం జరిగింది రా నీకు చెల్లెకు ఏమైనా గొడవ జరిగిందా అని అడిగాడు ప్రశాంత్.

అలాంటిదేమీ లేదు ప్రశాంత్ నీకు తెలుసు కదా చాలా మంచిది సర్దుకుపోయే మనస్తత్వం గలది తనతో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు.

నాకెందుకో ఉద్యోగం చేయాలనిపించడం లేదు. చిన్ననాటి నుండి నాకో  కోరిక ఉండేది. వ్యవసాయం చేయాలని. చిన్ననాటి నుండి చదువు వలన, ఇక్కడే సిటీ లో ఉండాల్సి వచ్చింది. ఇప్పటికే ఊర్లో స్నేహితులంతా పల్లెను మర్చిపోయావ్ అని ఎగతాళి చేస్తున్నారు, వాళ్ళకేం తెలుసు నేను ఎంత  బాధ పడుతున్నానో. నేను వ్యవసాయం చేస్తాను అంటే నాన్నగారు ఒప్పుకోవడంలేదు, ఇంత చదువు చదివి వ్యవసాయం చేయడం ఏంటి అని తిడుతున్నారు

నాకు మాత్రం ఎక్కడ ఉండాలి అనిపించడంలేదు. నీకు తెలుసు కదా నేను సేంద్రీయ వ్యవసాయం గురించి స్టడీ చేశానని ఆ పద్ధతిలో వ్యవసాయం చేయాలని నాన్న గారికి చెప్తే ఆయన ససేమిరా అంటున్నారు ఆయన మాటకి ఎదురు చెప్పలేను.

నాన్నగారికి ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు రా ప్రశాంత్.

ప్రశాంత్ ఎప్పుడు చూడు సేంద్రీయ వ్యవసాయం అంటావు అంటే ఏంట్రా రమణ అని అడిగాడు.

రమణ సేంద్రియ వ్యవసాయం అంటే ఇటువంటి రసాయన ఎరువులు, పురుగుమందులు, వాడకుండా కేవలం ప్రకృతి సిద్ధమైన ఎరువులు వేపపిండి వంటి పదార్థాలు వాడి పంటలు పండించడం. మళ్లీ ఇందులో రెండు పద్ధతులు ఉన్నాయి.

మొదటి పద్ధతిలో కేవలం ప్రకృతి సిద్ధమైన ఎరువులు, అనగా ఎండిన ఆవు గేదె. పేడ ఆకుతుక్కు, వర్మి కంపోస్ట్, వేప పిండి వంటి పదార్థాలు పాడి పంటలు పండించడం.

రెండవ పద్ధతి గో ఆధారిత పద్ధతి. ఈ పద్ధతిలో సేంద్రియ వ్యవసాయం జీవామృతం సహజ రసాయనం తో పండించడం.

ప్రశాంత్ ఒరే రమణ ఇవన్నీ ఇప్పుడు తెలుసుకున్నావు రా ఇంత బాగా చెప్తున్నావు, మరొకసారి అంకుల్ కి చెప్పి చూడు. ఈ విషయంలో ఎవరు చెప్పినా వినరు నాన్నగారు, అమ్మ ఒక్కతే నచ్చ చెప్పగలదు ఆయనకి. ఆఫీస్ నుండి ఇంటికి వెళ్ళాక తల్లికి ఫోన్ లో రమణ బాధనంతా చెప్పేసరికి, సరే నాన్న నా ప్రయత్నం నేను చేస్తాను కానీ అంతిమ నిర్ణయం నాన్నగారిది అంటుంది లక్ష్మి.

ఈమాట చాలు అమ్మ నీ మీద నాకు నమ్మకం ఉంది అంటాడు రమణ. ఇప్పుడు ఊర్లో చూద్దాం.

రాత్రి భోజనాలయ్యాక అబ్బాయి ఫోన్ చేశాడు అండి అంటూ రమా చెప్పిన ఈ విషయాన్ని రాఘవయ్య గారి కి చెప్పింది లక్ష్మి. ఓహో నేను కాదన్నాని నీతో చెప్పించాలని చూస్తున్నాడా నీ కొడుకు అని రాఘవయ్య గారు అనేసరికి, అది కాదండి మనకున్నది ఒక్కగానొక్క బిడ్డ, మీరు ఏం చదవమంటే అదే చదివాడు, మీరు చెప్పిందే వేదం వాడికి, కన్నతల్లిని ఉన్న ఊరిని మరవకూడదు అంటారు. మీకు చెప్పేంత తెలివైన దానిని కాదు గాని, ఆ కాంక్రీటు అడవిలో ఉండలేక వాడు ఎంత ఇబ్బంది పడుతున్నాడు ఒకసారి ఆలోచించండి. ఒక్క అవకాశం ఇవ్వండి మన అబ్బాయికి. వాడికి చిన్ననాటి నుంచి కూడా వ్యవసాయం చేయాలనే కోరిక అండి. అయినా వాడికి ఉద్యోగం వచ్చిన తర్వాత అమ్మ నాన్న మీరు కూడా నాతో ఉండండి అంటే, మీరు ఏమన్నారు మర్చిపోయారా, *పల్లెను మరిచే బతుకులు *మాకు వద్దు రా ఎందుకు, ఇక్కడ ఉండే స్వచ్ఛమైన మనుషులు మనసులు ఇంకెక్కడ ఉండవు, ఆత్మీయ పలకరింపులు ఉండవు, అంటూ వాడికి నచ్చజెప్పారు.

వాడు తిరిగి మళ్లీ మన దగ్గరికి వస్తానంటే వద్దంటున్నారు ఒకసారి ఆలోచించి చూడండి అంటూ చెప్పడం ముగించింది లక్ష్మి.ఆలోచనలో పడ్డ రాఘవయ్య గారు సరే నీ కొడుక్కి చెప్పు ఆ మాట గా అన్నారు.

వెంటనే లక్ష్మి రమణ కు ఫోన్ చేసి చెప్పగానే ఆనందంతో తన భార్య  రమకు చెప్తాడు. రమా నీకు నాతో పాటు ఊర్లో ఉండడం ఇష్టమేనా అని అడుగుతాడు రమణ. అప్పుడు రమా అంటుంది మీ కోరిక గురించి నాకు తెలుసు అండి మీ ఇష్టమే నా ఇష్టం. నేను అడ్డు చెప్పను అంటుంది.

రమా ఊళ్లో నా స్నేహితులు నన్ను ఎంతో ఎగతాళి చేసేవారు ఏమనో తెలుసా ఎంత చదివి ఏం లాభం పల్లెను మరచిన బ్రతుకు రా నీది అనే వారు నన్ను చూసి నవ్విన వారు ముక్కున వేలేసుకునేలా సేంద్రియ వ్యవసాయం చేస్తాను. వ్యవసాయం చేయడం అంటే చిన్న నాటి నుండి నాకు వల్లమాలిన ప్రేమ ఇన్నాళ్లకు ,

        *నా కోరిక* నెరవేరబోతుంది.

 రచయిత::యం. సుశీల రమేష్

You May Also Like

One thought on “నా కోరిక

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!