పరివర్తన

పరివర్తన

 

రామారావు సుశీలమ్మలకు లేక లేక కలిగిన సంతానం చరణ్.అతి గారాబంతో,ఎవరికీ మర్యాద ఇవ్వకుండా,  మొండిగా పెరిగాడు.

కుటుంబం అంతా ఒకరోజు రైలు ప్రయాణంలో ఉండగా..తల్లిదండ్రుల్ని కొల్పోయిన అనాథ ..పవన్ నీ ఇంటికి తెచ్చుకున్నారు.

వాళ్ళ అబ్బాయి చరణ్ కి తోడుగా ఉంటాడు అని . ఇద్దర్నీ సమానంగా చూసేవారు.

పవన్ ఎంత ప్రేమ చూపినా…   అనాధవు నీవు అని గేలి చేస్తూ బాధ పెట్టేవాడు చరణ్. అయినా పవన్ ఇవేవీ పట్టించుకోక అతనితో ప్రేమగా  ఉండేవాడు.

తల్లిదండ్రులు చరణ్ నీ విదేశాల్లో చదివించారు పవన్ మాత్రం మిమ్మల్ని వీడి  ఎక్కడికి వెళ్ళను అని ఊర్లోనే చదువుకున్నాడు .

ఇద్దరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి.. ఒక ఆక్సిడెంట్ లో తల్లిదండ్రులిద్దరూ కన్నుమూశారు.

పవన్  అగ్రికల్చరల్ బీఎస్సీ కాగానే  ఊర్లో ఉన్న ఇల్లు ,పొలాలు చూసుకుంటూ.  కొత్త కొత్త వ్యవసాయ పద్దతులు పాటిస్తూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు  గడిస్తూ ,

పదెకరాలని పాతిక  చేసి, పిల్లలను  దగ్గరలో  ఉన్న స్కూల్లో చదివిస్తూ  మరింత ఉత్సాహం తో కాలం గడుపుతున్నాడు.

చరణ్ విదేశాల నుండి రాగానే   మంచి కంపెనీలో జాబ్ సంపాదించి . వచ్చే జీతమంతా జల్సాలకే  ఖర్చు   చేస్తూ,  తన ఆఫీస్లోని  మిగతావాళ్ళతో  పోల్చుకుని  డాబుకోసం అవసరం లేకున్నా అధిక అద్దె కల్గిన  ఇంట్లో  ఉంటూ,ఇద్దరు  పిల్లల్ని కార్పొరేటు   స్కూల్లో  చదివిస్తూ పార్టీలు, పబ్బులు అంటూ తిరిగేవాడు. అంతలో కరోనా  విలయతాండవంతో … అన్ని కంపెనీలు  ఆర్థిక సంక్షోభతో మూత పడ్డాయి.

కష్టపడి పనిచేసే కొందరిని మాత్రం ఉండమని మిగతా  వారిని ఉద్యోగంలోంచి తీసేశారు  అందులో చరణ్ కూడా ఉన్నాడు.

టీవీలో వార్తల ద్వారా విషయం తెల్సుకున్న పవన్ పట్నంలో ఇల్లు ఖాళీ చేయించి తమ్ముడిని ఇంటికి పిలిపించుకున్నాడు.

చరణ్ అన్నను పట్టుకుని బోరున విలపించాడు. ” నీకంటే ఎక్కువ చదివాను, నేనే గొప్ప  అని  నాన్నకు, నీకు… అన్నం పెట్టే పల్లె తల్లికి.. వ్యవసాయానికి ఎప్పుడూ విలువ ఇవ్వలేదు.. జాబ్  ఉందనే ధీమాతో ఏనాడు కష్టపడి పనిచేయలేదు. డబ్బు పొదుపు చేయలేదు.   నాతో ఉంటూ నా డబ్బులు  ఖర్చు  చేయించిన నా స్నేహితులు  నాకు జాబ్ పోగానే  పలకరించడం కూడా మానేశారు.”

చదువు వుండగానే సరిపోదు  సంస్కారం  లేని   చదువు వ్యర్థం అని నిరూపించి నన్ను నా కుటుంబాన్ని ఆదుకున్నావు. నన్ను క్షమించు అన్నయ్యా.. రేపటినుండి నేను కూడా పొలానికి వస్తాను” నా  పిల్లలను కూడా నీ పిల్లలు చదువుకునే బడిలోనే వేస్తాను. అని కన్నీటితో అనగానే  పవన్ తమ్ముణ్ణి దగ్గరకు తీసుకుని

” పల్లె తల్లి …మనం చేసే మంచి ఎప్పుడూ మనల్ని కాపాడుతాయి’  అన్నాడు.. అందరూ  ఎంతో సంతోషించారు.

నీతి :  “బంధాల విలువ  తెలుసుకోవాలి.  పల్లెలను.. అన్నదాతలను చులకనగా చూడకూడదు. పల్లెలు తల్లిలా అన్నివేళలా ఆదుకుంటాయి.

రచయిత : వేముల ప్రేమలత

You May Also Like

2 thoughts on “పరివర్తన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!