నిరవధిక బూటకం

నిరవధిక బూటకం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: ఎన్. లహరి

ప్రపంచమనే రంగస్థలంలో
మనుషులందరూ నటులే
ఎవరి పాత్ర వారిది
జీవితం ఒక నాటకం
కొన్ని పాత్రలు అర్థాంతరంగా ముగుస్తాయి,
ఇంకొన్ని పాత్రలు అర్థవంతంగా కొనసాగుతాయి,
అవసరం లేని సుఖాలు కొందరివి,
అనివార్యమైన దుఃఖాలు ఇంకొందరివి,
జీవితం ఒక “ఆట” లాంటి నాటకం
ఇదో వైకుంఠపాళి
విధి పాచికలు విసురుతుంది
నిచ్చెనలు, పాములు.
ఒకరి సాయంతో పైకి ఎగబాకేలోపే,
మరొకరి మోసంతో కిందకు దిగడం
అవమానాలు, అవహేళనలు
అవరోధాలు, అడ్డంకులు
ఇదే కదా జీవితం
జీవితం ఒక “సముద్రం” లాంటి నాటకం
విజయపు తీరాన్ని చేరాలనుకునే అలలను
అమాంతం వెనక్కి లాగే అసూయ సాగరం
లోతు తెలియని ఒడిదుడుకుల సమరం
శోక తుఫాను ధాటిలో నిత్య కల్లోల కడలి

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!