గజ్జెల సవ్వడి

గజ్జెల సవ్వడి
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: పి. వి. యన్. కృష్ణవేణి

నీ పాదం మీద కదిలే ఆ ఘజ్జలై ఉండనా
నీ కాలి అందెల సవ్వడి వింటూ ఉండనా
ఆ అలజడితో నన్ను నేను మైమరచిపోనా
అదే జీవితానికి ఓ వరం అనుకోనా
ఘల్లుఘల్లున సవ్వడి చేస్తూ నువ్వు నడుస్తూ ఉంటే
నా యదలో సంగీతం మోగుతూ ఉంటే
నీ చిరునవ్వుల చిరుఝల్లుల్లో తడుస్తుంటే
ఆ ప్రకాశమే నా వదనానికి అందం పెంచుతుంది
నా మదిలో విరిసిన ఆశల సమాహారం నువ్వు
నా జీవితానికి అర్దం నువ్వు
ఇంటికి నిండుతనమే నువ్వు
నా హృదయంలో అరవిరిసిన జాబిలి నువ్వు
ఏదో తెలియని కలవరం నువ్వు వీడి వెళితే
నేను కన్న స్వప్నానికి అర్దం నువ్వు
నా ఇంటి అందాల ఆడపిల్లవు నువ్వు
మరో ఇంటికి దీపమై వెలుగు, వెలుగులు పంచు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!