బాలగేయం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: శిరీష వూటూరి
చిట్టి చిట్టి పాపాయి
పాల బుగ్గల బుజ్జాయి
ఎందుకు ఏడుస్తున్నావు
చీమ నిన్ను కుట్టిందా
అమ్మ నిన్ను కొట్టిందా
జామ పండు కావాలా
మామిడి పండు ఇవ్వాలా
పాట ఒకటి పాడాలా
కమ్మని కథనే చెప్పాలా
దాగుడుమూత ఆడుదామా
జారుడుబండ జారుదామా
పాప నీకు ఏమిష్టం
ఎందుకు ఏడుస్తున్నావు
పిల్లి పాలు తాగింది
అమ్మ పాలు లేవంది.