క్షమించు

క్షమించు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: మాధవి కాళ్ల

నీతో గడిపే ప్రతి క్షణం ఒక జ్ఞాపకం.
నువ్వు నాకు ఒక జ్ఞాపకం.
నువ్వు నాతో జీవితాంతం ఉండాలి అనుకున్నా.
కానీ నేను నీతో జీవితం అంతా ఉండలేను.
ఎందుకంటే నేను ఇంకా కొన్ని రోజులే నీతోనే ఉంటాను..
నువ్వు బాధ పడడం నేను చూడలేను కానీ తప్పదు.
అందుకే నేను నిన్ను బాధ పెడుతున్నా..
నువ్వు నన్ను పూర్తిగా మర్చిపోయి మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా..
నామీద నీకు ప్రేమకు బదులు అసహ్యం కలగాలి..
నువ్వు నన్ను మర్చిపోవాలని నీతో ఇలా ప్రవర్తిస్తున్నాను ..నన్ను క్షమించు..
నీతో మాట్లాడకుండా ఉండలేను..
కానీ తప్పదు నేను నీ జీవితంలో ఉండకూడదు.
నేను నిన్ను ప్రేమిస్తున్నానని గట్టిగా అరుస్తూ చెప్పాలని అనుకున్నాను.
అప్పుడే నాకు తెలిసింది నేను కొన్ని రోజులే ఉంటానని కన్నీళ్లు దాచుకొని నీతో అబద్ధం చెప్పాను.
నేను నిన్ను ప్రేమించడం లేదు అని..
నా గురించి ఆ నిజం నీకు తెలిస్తే నువ్వు తట్టుకోలేవు అని అబద్ధం చెప్పాను
నాకు నీ మీద ప్రేమ లేదు అని చెప్పా
నన్ను క్షమిస్తావని అని ఆశిస్తూ ఎప్పటికీ నీ దానికి కానీ నీ ప్రియురాలిని.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!