ప్రకృతి సమతుల్యాతాహారం

 ప్రకృతి సమతుల్యాతాహారం

రచయిత :: మక్కువ. అరుణకుమారి

పచ్చని ప్రకృతి శోభ
పుడమికి తరగని శోభ
పులకిత కాంతుల శోభ
జగతికి కన్నుల శోభ

అద్భుతమైన ప్రకృతి
అనంతమైన ప్రకృతి
జీవ వైవిధ్య ప్రకృతి
జీవ వర ప్రదాత ప్రకృతి

తరువులే ఘన గురువులు
త్యాగానికి నెలవులు
కావు పుడమికి బరువులు
జనులకు కల్పతరువులు

రవి కిరణపు ప్రకాశువు
గాలిలో ప్రాణవాయువు
పత్రహరిత రేణువు
ఒసగు పంచ భక్ష్యవు

ఓజోను పొర తొడుగు
పుడమికి మేలి ముసుగు
జగతికి రక్షణ నొసగు
దానికి చేయకు చెడుగు

పచ్చదనం మీద కక్ష
వేస్తుంది మనకు శిక్ష
ప్రకృతి ప్రసాదిత భిక్ష
అదేగా శ్రీ రామరక్ష

.క్రిమి,కీటకాల రక్షణ
పశు,పక్షుల సంరక్షణ
మానవాళి సంప్రోక్షణ
పర్యావరణ రక్షణ

చేసే ప్రకృతి సేద్యం
పుడమికదే నైవేద్యం
పెరటితోటల సేద్యం
ఖర్చే లేని వైద్యం

తెలంగాణ గానం
హరితహార విహారం
ఆంధ్రావని గానం
వనం-మనం సమాహారం

పుడమికి హరితహారం
ప్రకృతి సమతులాహారం
అవనికి ముత్యపుహారం
జీవ రక్షణా హారం

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!