అంశం: చీకటి వెలుగులు
రాత్రింబవళ్ళు
రచన: చింతా రాంబాబు
జీవితమనే రోజుకు
చీకటనే బాధలుంటేనే
వెలుగులనే ఆనందాల
పువ్వులు పరిమళిస్తాయి
చీకటి ఉంటేనే..
వెలుగుకు విలువ
వెలుగనే సంతోషాల
విలువ తెలియాలంటే
చీకటనే బాధలు ఉండాలి
జీవితంలో చీకటి వెలుగులు
రాత్రింబవళ్ళు లాంటివి
చీకటనే అంధకారాన్ని తొలగించుకొని
హృదయాలలో
ఆత్మ విశ్వాసమనే జ్యోతులను వెలిగించినప్పుడే
జీవితమనే మతాబు
ప్రకాశవంతమైన
కాంతులు వెదజల్లుతుంది
