విజయ సాధన

అంశం: చీకటి వెలుగులు

విజయ సాధన

రచన: పసుమర్తి నాగేశ్వరరావు

జీవితం సుఖదుఃఖాల సంగమం
జీవితం చీకటి వెలుగుల పయనం
జీవితం మంచి చెడుల సమన్వయం
జీవితం వెలుగు నీడల బ్రమరం
చిగురుటాకులాంటి
ఛిద్రమైన జీవితాలు
చీకటిని చీల్చుకొని
చింతలేని బతుకులుతో
జీవితంలో వెలుగు రేఖలు ప్రసరింప జేయటానికి
ప్రతి మనిషి ప్రతీ రోజు
ఆనందకాంతులు వెల్లువిరిసే
నవ్యోన్మేషమైన నూతనోత్సాహం తో
నవ్యమైన భవ్యమైన
రమ్యమైన రసరమ్యమైన
దివ్యమైన దేదీప్యమైన
ఒరవడితో ఉరవడితో
సరదా సందళ్ళు సంభ్రమాలుతో
ఉత్తేజమైన ఉత్సాహం తో
జీవితంలో విజయం సాధించాలని
జీవితాన్ని వెలుగుమయం చేయాలని సగటు మానవుని కోరిక
చీకటిని పారద్రోలి వెలుగు విజయం అందుకోవడమే నేటి విజయ సాధన

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!