గ్రంథాలయాలు

గ్రంథాలయాలు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

వ్యాసకర్త: వరలక్ష్మి యనమండ్ర

ప్రజల అవసరం కోసం అన్నిరకాల పుస్తకాలను ఒకేచోట భద్రపరచు ప్రదేశాన్ని “గ్రంథాలయం” అంటారు. గ్రంథాలయాలు కోసం “అయ్యంకి వెంకట రమణయ్య గారు ఉద్యమం నడిపి, దానిని వ్యాప్తి చేసి, గ్రంథాలయ పితామహుడుగా పేరు పొందారు”.
గ్రంథాలయాలు భాష, సాహిత్యం, సాంస్కృతిక చైతన్యం పరిమళించడానికి దారులు. గ్రంథాలయాలు భావితరాలకు చరిత్రను అందించే వేదికలు అనవచ్చును. గ్రంథాలయాలు ముఖ్యంగా నాల్గు రకాలుగా చెప్పవచ్చును.
1.జాతీయ గ్రంథాలయాలు
2. విద్యాలయ గ్రంథాలయాలు
3. పౌర గ్రంథాలయాలు
4. ప్రత్యేక గ్రంథాలయాలు
ఈ కాలం కొత్తగా ఏర్పాటు చేయబడినవి డిజిటల్ గ్రంధాలయాలు. పఠనం జీవితానికి నాణ్యతను జోడిస్తుంది. బాల్యం నుండే పుస్తక పఠనం అలవాటు చేసుకుంటే మేధస్సు పెరుగుటకు ఉపయుక్తము. గ్రంథాలయాలకు ఆదివారం సెలవు. గ్రంథాలయాలకు నియమిత సమయాలు ఉంటాయి. నిశ్శబ్దాన్ని పాటించాలి. గ్రంథాలయాలు మనకు ప్రత్యామ్నాయ విద్యాలయాలు అని చెప్పవచ్చు. జ్ఞాననిర్మాణానికి పునాదులు గ్రంథాలయాలు. అజ్ఞాన అంధకారాలు తొలగించే విజ్ఞానా కేంద్రాలు ఇవి. కథలో పుస్తకాలు, బొమ్మల పుస్తకాలు కూడా ఉంటాయి. దిన పత్రికలు, వార, పక్షి, మాస పత్రికలు ఉంటాయి. అన్ని చోట్లా గ్రంథాలయాలు ఉంటాయి. వీటిని నిర్వహించడానికి గ్రంథాలయ స్థాయిని బట్టీ ఉద్యోగులను నియమిస్తారు. చాలా మంది పెద్దలు ఈ గ్రంథాలయాలను వినియోగించుకుని వారి జీవితంలో ఉన్నత స్థాయిలను చేరుకున్నారు. గ్రంథాలయాలను ప్రభుత్వమే నిర్మిస్తుంది. నేడు గ్రంథాలయాలలో ఇంటర్నెట్, కంప్యూటర్ సౌకర్యం కూడా ఉన్నది. వీటి ఉపయోగాలను ప్రచారం చేయవలసిన బాధ్యత, ఉపాధ్యాయులకు, రాజకీయ నాయకులకు ఉన్నది. ప్రతి పాఠశాలలో, కళాశాలలో తప్పని సరిగా గ్రంథాలయాలు ఏర్పాటు చేసి, అవి పిల్లలకు ఉపయోగపడేలా చూసే బాధ్యత అధికారులు కూడా స్వీకరించాలి. అత్యంత ఖరీదైన ఫ్రొఫెషనల్ పుస్తకాలు విద్యార్ధులు ఉచితంగా తీసుకుని చదువుకోవచ్చు. ఇన్ని ఉపయోగాలున్న గ్రంథాలయాలు మరుగున పడిపోవడం సోచనీయం. కాబట్టి సంబంధిత పెద్దలు, విజ్ఞులు ఆలోచించి, గ్రంథాలయాలను పునరుద్ధరించాలి.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!