శిల్పి
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: విస్సాప్రగడ పద్మావతి
నీ కండలను కరిగించి
రాయిని కూడా దేవుడిగా
మలచే శక్తివంతుడవు
సుందర దృశ్యాలను,
చరిత్రను చాటిచెప్పే కళాఖండాలను
ఆవిష్కరించి
జగతికి వెలుగయ్యావు
బతుకు తెరువు కోసం
శిల్పిగా మారి
ఉన్నత సౌదాలను మలచినా
నీ నివాసానికి సదనమే కరువు
నీ వృత్తికి నీవే బరువు
ఓర్వ లేని నేటి సమాజ పోకడకు విస్తుపోయి
నీలో రేగే అంతర్ విస్పోటనం
నీవు చెక్క శిల్పాల్లో ప్రస్ఫుటం
నీ ప్రతిభకు పట్టం కట్టక
నీ నైపుణ్యం గుర్తింపక
నీ ఉనికే ప్రశ్నార్థకమై
దిక్కుతోచని దీనస్థితిలో
నీకు నీవే శిలగా మారావా?
నిన్ను నీవే శిల్పంగా
మార్చుకుంటున్నావా?
కొండల్ని పిండి చేసే శక్తి
నీలో దాగి ఉన్నా
నీపొట్ట పోషించుకునే
తీరు ఎరుగకున్నా
జీవన ఎదురీత ఆగక
నిరంతరం సాగే పోరాటం
సముద్రమథనమే
అయినప్పటికీ
నమ్మిన నీ వృత్తిని విడువక
కొనసాగే నీ ప్రయాణం
చరిత్రకు తార్కాణం
నీ మేధస్సు
లోకానికి ఉషస్సు
Super🤗👍👌👌
దిక్కు తోచని దీన స్థితిలో నీకు నువ్వే శిలగా మారవా
గ్రేట్ లైన్ అండీ
చాలా బాగా వ్రాసారు పద్మావతి గారు
Congratulations 👌👌👍🤗
చాలా బాగుంది.
Very nice