అమావాస్య

అమావాస్య
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: అలేఖ్య

“అ” మావాస్య ఆంతర్యం
నిశిధిలో అక్రమాలకు అభయం
వెండి వెలుగుల చందమామ
నీడ జాడ కానరాకపోయే
వెన్నెల తివాచి ఒక్కపారే ఎంచక్క ముడుచుకుపోయే
చిమ్మ చీకటి కాటుకంటి నలుపు
అసుర ఆలోచనల గెలుపు
నలుదిక్కుల నలుపే నలుపు
మానవ యమకింకరుల వికృత చేష్టలకి
తోవ బహు సులువు
అధర్మం చీకటిలో రాజ్యమేలిన
అన్యాయం చీకటిని ఆసరాగా మలుచుకున్న
దగాబడి కాళరాత్రిలో సమాధైన సత్యం
రేపటి కాంతి సాక్షిలో సజీవం
రేపటి రాబోవు తొలి ధర్మపు కిరణం “అ”ధర్మాన్ని “అ”న్యాయాన్ని దహించక మానునా.
జగమెరిగిన సత్యం!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!