నాన్న ఇచ్చిన నమ్మకం ‘అసలైన గుర్తింపు’

నాన్న ఇచ్చిన నమ్మకం :అసలైన గుర్తింపు

రచన ::ఎన్.ధన లక్ష్మి

“ఏంటో ఎదవ జీవితం  ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా,ఏ గవర్నమెంట్ జాబ్ రాస్తున్న రావట్లేదు .. అని హాల్ లో సర్టిఫికెట్స్ చూస్తూ బాధ పడుతూ అంటాడు సూర్య ..
ఏమయిందిరా కన్నా ఎందుకు ఆలా బాధ పడతావు వస్తుందిలేయ్ వెళ్లి ఫ్రెష్ అయి రా ఏమైనా తిందువు కానీ చాలా బాధగా భయంగా ఉంది మ్మా నాకు జాబ్ వస్తుందా? నా బిడ్డ కు ఏమీ  తక్కువ  ?? కొంచం టైం పడుతుంది లే కన్నా వెళ్లి ఫ్రెష్ అయి రా నీకు ఇష్టమైన పకోడీ చేశాను తిందువు కానీ అంటూ సూర్య ను బలవంతంగా లోపలకీ పంపిస్తారు లక్ష్మి గారు .
ఈ మాటలు అన్ని వింటారు అక్కడే ఉన్న ప్రకాష్ గారు లక్ష్మి మనం గుడికి వెళ్లి చాలా రోజులు అయింది కదా ఎలాగో ఈ రోజు శనివారం వెళ్ళదం రెడీ అవ్వండి  ఇద్దరు
రేయ్ కన్నా నాన్న గుడికి వెళదాం అన్నారు రెడీ అవ్వు కన్నా అంటూ సూర్య కి చెప్పి తాను వెళ్లారు రెడీ అవడానికి
సూర్య వెళ్లి నాన్న నేను రాను .నా మనసు ఏమి బాలేదు .ప్లీజ్ మీరు, అమ్మ వెళ్ళండి .
రేయ్ మనం ఆలా వెళ్లి చాలా రోజులు అయింది నా కోసం రా కన్నా అంటారు ఎంతో ప్రేమతో ప్రకాశం గారు .
ఎపుడు వాళ్ళ నాన్న తనని అలా అడిగి ఉండడు ఎప్పుడూ తన ఇష్టానికి వదలివేస్తారు వస్తువైనా ,చదువుయినా అన్ని తన ఇష్టానికి విలువ ఇస్తారు నాన్న అలాంటిది ఈ రోజు నాన్న గుడి కి రమన్నారు.నాన్న ని బాధ పెట్టడం ఎందుకు వెళ్లి వస్తే సరి పోతుంది నాకు కూడా కొంచం రిలాక్స్ గ ఉంటుంది అని మనసులో అనుకొని సరే నాన్న అంటూ రెడీ అయి వస్తాడు
అందరూ గుడికి కలిసి వెళ్లారు దర్శనం చేసుకొని అడుగు మీద కూర్చుంటారు .
లక్ష్మి గారు కొబ్బరిముక్కను సూర్యకి ,ప్రకాశం చేతికి  ఇస్తారు .సూర్య కి ఎంతో రిలాక్స్ గ ఉంటుంది
ప్రకాశం గారు తింటూ కన్నా అక్కడ ఏమి జరుగుతుంది అంటూ అడుగుతారు ..
నాన్న  కొబ్బరికాయలను కొడుతున్నారు .
అవును సూర్య ఇక్కడ రాయి ఉంది ,లోపల కూడా రాయితో చేయబడ్డ విగ్రహము ఉంది కదా మనం లోపలే అంటే దేవుడుడి మీదే రాయితో కొట్టచ్చు కదా అంటారు ప్రకాశం గారు
అయ్యో నాన్న అలా ఎలా చేస్తాం లోపల ఉంది దేవుడు  చేయకూడదు .
రాయి మీదే కొబ్బరి కాయ కొట్టచ్చు అంటాడు సూర్య
ఇవి రెండు రాళ్ళై కదా ఎందుకు ఇంత తేడా వచ్చిందో తెలుసా అంటూ నీకు ఒక కథ చెప్పుతాను విను అంటూ చెప్పడం స్టార్ట్ చేస్తారు
ఒకప్పుడు ఒక శిల్పి కొండా పైకి వెళ్లి ఒక రాయిని కొట్టడం స్టార్ట్ చేసాడు అప్పుడు..ఆ రాయి బాబు నన్ను కొట్టదు నేను బాధలను తట్టుకోలేను నన్ను వదిలేసి వెళ్లి పో అన్నది
ఆ శిల్పి ఇంకో రాయిని కొట్టడం స్టార్ట్ చేసాడు.అలా సుమారు ఓ పది దెబ్బలు వేసిన ఆ రాయి సైలెంట్ గ ఉంది.ఆ శిల్పి ఆశ్చరంగా నీకు నొప్పి లేదా అన్నాడు. ఉంది అండి కానీ నేను తట్టుకోగలను .మీరు నన్ను ఒక అందమైన రూపంగ మార్చండి అంటుంది.
అలా ఎన్నో దెబ్బలను తట్టుకొని నిలబడింది
శిల్పి కొన్ని రోజులకి ఒక దేవుడు రూపాన్ని తయారు చేసారు దేవుడి విగ్రమును చూసిన అందరూ గుడి కట్టి .రోజు రకరకాలు పూలతో ,పండ్లతో ,ప్రసాదాలతో దేవుడిని పూజలు చేయడం స్టార్ట్ చేసారు…
గుడికి వచ్చిన వాళ్లంతా అక్కడ ఉన్న రాయి మీద కొబ్బరికాయలను కొట్టడం స్టార్ట్ చేసారు . ఏ రాయి అయితే నేను ఒక దెబ్బ కూడా తట్టుకోలేను ఆందో అది ఇప్పుడు రోజు దెబ్బలను తింటుంది
బాధను తట్టుకొని నిలపడ్డ రాయి ఇప్పుడు అందరిచేత గౌరవించ బడుతుంది ..అసలైన గుర్తింపు లభించింది చేయాలి అనే సంకల్పం ఉండాలి ..అపుడు అందరి జీవితాలు రంగుల మయం.వావ్ నాన్న స్టోరీ చాలా బాగా ఉంది …
ప్రకాశం గారు. ఎన్నో సార్లు తిరస్కరణ గురైనా, అవమానంపాలు అయిన కొందరు అవ్వని తట్టుకొని నిలపడి ఈ రోజు అందరి చేత గౌరవింప పడుతూ అందరి మన్ననలు అందుకున్నారు..ఎవరు తెలుసా?? నువ్వు ఎంత ఇష్టపడి మరి చూస్తావు కదా హ్యారిపోటర్ సిరీస్ రాసిన జెకె రోలింగ్ రచయిత తన బుక్ తీసుకొని  వెళ్లిన ప్రతి ఆఫీస్ రిజెక్ట్ చేసింది ఒకటి  కాదు ఏకంగా  12 ఆఫీస్ల  చుట్టూ తిరిగింది ప్రతి సారీ  తిరస్కారం  అయినా కూడా  తాను వెనుక అడుగు వేయలేదు . నీ లాగా భయపడుతూ కూర్చోలేదు .ఇప్పుడు  తాను  ఫేమస్  రచయత అంగవైకల్యం  ఉన్న  కూడా  ఎన్నో రిజెక్షన్  పేస్  చేసినా  ఎన్నో విజయాలు  సాధించిన వాళ్ళు  ఉన్నారు. ఒకతను  ఒక అమ్మాయిని చాలా ఇష్టపడాడు . అతను వెళ్లి  తన  ప్రేమ విషయం ఆమెకు  చెప్పితే ఆమె రిజెక్ట్ చేసింది ఎందుకో తెలుసా  ఆబ్బాయీ వాళ్ళ నాన్న  రైతు అని వాళ్లకు డబ్బు లేదు అని    కానీ ఆ అబ్బాయీ  నీకు లాగ బాధ పడుతూ కూర్చోలేదు.ఏ అమ్మాయీ  అయితే  తనను రిజెక్ట్ చేసిందో ఆ అమ్మాయికి అందనంత ఎత్తుకు ఎదగాలీ అని  తాను  నమ్ముకున్న  సంగీతం వైపు అడుగు వేసి ఇప్పుడు  ప్రతి ఒక అమ్మాయీ  కలల  రాకుమారుడు అయ్యాడు.వరల్డ్ లోనే టాప్ మోస్ట్ హ్యాండ్సమ్ పర్సన్ అయ్యాడు..
ఎవర్రా  అనుకుంటున్నావా !!! ఇంకా ఎవరు  మీ చెల్లి  ఫేవరెట్ పర్సన్  కిమ్  తెహ్యుంగ్ . మీ చెల్లి హాస్టల్ ఉంది కాబట్టి సరిపోయింది నా నోట ఈ పేరు
విన్నందుకు దేవుడు కూడా భయపడి పారిపోయేలా గట్టిగా అరిచేది .సూర్య గట్టిగ నవ్వుతాడు .
కన్నా ఇప్పుడు నువ్వే చెప్పు బయట ఉన్న రాయి లాగా బాధలను తట్టుకోలేక ఉండిపోయి అలా గుర్తింపు లేకుండా ఉంటావా లేదా లోపల ఉన్న విగ్రహము లాగా బాధలను ,ఓటమిలను తట్టుకొని గుర్తింపు తెచ్చుకుంటావా చెప్పు కన్నా అంటారు.
నీకు నిజ జీవిత గాథలు చెప్పాను.వారి నుంచి  నేర్చుకోవచ్చు.. ఓడిపోతాను అన్న భయంతో, బాధపడుతూ ఇంట్లోనే ఉంటావా లేక ఇంకోసారి  ప్రయత్నిస్తావా… నిర్ణయం నీ చేతిలోనే ఉంది!?
సూర్య లేదు నాన్న నేను ఇంకా ఓటమికి కృంగిపోను ఆత్మవిశ్వాసంతో ముందు అడుగు వేస్తాను
థాంక్స్ లాట్ నాన్న అంటాడు ..
చూడు కన్నా ! నువ్వు ఎన్ని కష్టాలు పడి,బాధలను ఓర్చుకుంటు నిలపడతావో అపుడే నీకు నువ్వు అంటే ఏంటో తెలుస్తుంది నీ శక్తి ఏంటో  అవగతం అవుతుంది .నీలో ఉన్న టాలెంట్ బయటకి వస్తుంది
నీకు జాబ్ వచ్చిన నువ్వు చక్కగా పని చేస్తున్న సరి అయిన గుర్తింపు లేదు అన్ని ఫీల్ అవ్వకు.నువ్వు చేసే పని కనపడాలి కానీ నువ్వు కాదు .నీ పని నిన్ను ఎవరికీ అందనంత ఎత్తులో నిలుపుతుంది.నీ పనిని నువ్వు గౌరవించు.అది నిన్ను కాపాడుతుంది అర్థము అయిందా అంటే థాంక్స్ ఆ లాట్ నాన్న అంటూ వాళ్ళ నాన్న ను హాగ్ చేసుకొని  ఈ హ్యాపీ మూమెంట్స్ లో ఒక సెల్ఫీఏ అంటూ తీసుకుంటూ ఉంటారు.
మరి నేను వద్ద అన్న పిలుపుతో ఇద్దరు వాళ్ళ అమ్మ వైపు చూస్తారు లక్ష్మి గారు అంతే రా నేను వద్దు కదా సెల్ఫీకి అన్ని కోపంగా ఆంటే అరేయ్ నా డార్లింగ్ లేకుండా మా సెల్ఫీఏ ఇన్ కంప్లీట్ అమ్మ అంటూ ఫ్యామిలీ సెల్ఫీ దిగుతారు
సూర్య తన జాబ్ ట్రయల్స్ చేస్తూనే మొబైల్ యూస్ చేసి తనకి తెలియని వాటిని నేర్చుకుంటూ ఉన్నాడు అల తన శ్రమకు ఫలింతంగా DRDO లో గవర్నమెంట్ జాబ్ తెచ్చుకొని నిజాయతీగా అందులో పని చేస్తూ  మంచి ఆఫీసర్ గ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు
బాధలు ,ఓటమి లను ఎప్పుడు అయితే తట్టుకొని నిలపడతామో అపుడే మనకు  అసలైన గుర్తింపు లభింస్తుంది ..ఎందుకంటే  ఓటమికి మించిన గురువు ఏది లేదు ,,,మీ విజయం బహుశా మిమ్మలని ప్రపంచానికి పరిచయం చేయచ్చు ..కానీ ఓటమి మీకు ప్రపంచం ఆంటే ఏంటో తెలిసేలా చేస్తుంది … మిమల్ని అందరిలో అసలైన గుర్తింపు ఉండేలా చేస్తుంది
మిమ్మల్ని మీరు బలహీనంగా భావించడం గొప్ప పాపం మిమ్మల్ని మీరు మరింత శక్తివంతం చేయగలరని నమ్మండి … మీరు  ఏదైనా చేయగలరు

“సమాప్తం”

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!