లోన్ యాప్

లోన్ యాప్
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

వ్యాసకర్త : మాధవి కాళ్ల

         “ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగోలేక వచ్చిన జీతం డబ్బులు సరిపోకపోతే ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినా డబ్బులు దొరకలేదు. టీవీలో ఒక యాడ్లో పర్సనల్ లోన్ యాప్ గురించి చెప్పడం చూసాను”. నా అవరాలకు డబ్బు దొరికినందుకు నేను సంతోషం పడ్డాను. “వెంటనే నా ఫోన్ లో యాప్ డౌన్లోడ్ చేసి వాళ్ళని సంప్రదించాను.”
“నెల నెల కొంత డబ్బులతో రుణం వాళ్ళకి మొత్తం డబ్బులను చెల్లించాను. అయినా సరే ఇంకా కట్టమని వాళ్ల నుండి ఫోన్ కాల్స్ వస్తూనే ఉండేవి.” “వాళ్ళకి ఎన్ని సార్లు చెప్పినా వినకుండా మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసి బెదిరించేవారు, నా ఫొటోస్ ని మార్ఫింగ్ చేసి బంధువులకు, ఫ్రెండ్స్ కి పంపిస్తానని బెదిరించేవారు. “కాంటాక్ట్‌ లిస్టులో ఉన్న ఫోన్‌ నంబర్లకు మోసగాడు అంటూ మెసేజ్‌ పంపారు.” “అనవసరంగా వాళ్ళ దగ్గర లోన్ తీసుకున్నానే అని ఎన్నోసార్లు బాధపడ్డాను”. కానీ వాళ్ళు బెదిరింపులు అస్సలు ఆగలేదు. “వాళ్ళ బెదిరింపులు భరించలేక మళ్ళీ లోన్ కట్టాల్సి వచ్చింది. అయినా సరే వాళ్ళ బెదిరింపులు ఆగలేదు”. ఒకరోజు రాత్రి వాళ్ళ ఒత్తిడి తట్టుకోలేక లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్నాను. “ఇలాంటి లోన్ యాప్ లో లోన్ తీసుకోవడం అసలు మంచిది కాదు. ఇలాగే ఎంతో మంది లోన్స్ తీసుకొని, వాళ్ళ ఒత్తిడి భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు “.  స్మార్ట్ ఫోన్ ఉంటే ఎంత లాభమో , అంతే నష్టం కూడా. అందరూ కొంచం జాగ్రత్తగా ఉండండి.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!