తెలివైన కోడలు పిల్ల

తెలివైన కోడలు పిల్ల

రచయిత :: వాసి జ్యోత్స్న

” ఒరేయ్ విష్ణు ఏం చేస్తున్నావ్ రా.” ” నువ్వు మారవా ఇక “. 24 ఏళ్ళు వచ్చినా ఇంకా ఇలానే తిని కూర్చుటావా. కనీసం మీ నాన్నతో పొలమైన వెళ్లి ఆ పనైనా నేర్చుకోవచ్చు కదరా. ఆ…. భలే చెప్పావు అమ్మ మీరు ఇంత సంపాదించిపెట్టారు నా కోసమేగా నేనెందుకు ఇంకా కష్టపడాలి. కష్ట పడడం నా వల్ల కాదు గాని అమ్మ నువ్వెళ్ళి మంచి పకోడీ వేసుకుని రా….అలా అడుగులు వెనక్కి వేస్తూ వీడు ఎలా మారతాడు. ఇక వీడింతేనా అని తనలో తానే మాట్లాడుకుంటూ గుమ్మందగ్గర మెట్లపై కూర్చుంది. పక్కింటి శాంతం వచ్చి వదినా ఏంటి..? అంత దిగాలుగా కూర్చున్నావు. ఏమైంది వదిన అన్నయ్య ఏమైనా అన్నారా ఏంటి..? అయ్యో రామ అయన నన్నేమంటారే తల్లి నా కొడుకు పరిస్థితి ఏంటో నాకు అసలు అర్ధం కావడం లేదు అని జరిగినదంతా చెప్పగానే….
వదిన దీనికి ఒకటే మార్గం వుంది. అర్జెంట్ గా విష్ణు కి పెళ్లి చేసేయ్ వదిన వచ్చిన పెళ్ళాన్ని బట్టి వాడే మారతాడు. అంతే అంటావా….? శాంతం. అంతే వదిన ఇప్పటి ఆడపిల్లలు చాల చురుగ్గా వుంటున్నారు పెళ్ళైన క్షణం నుండి మొగుడ్ని కొంగుక్కట్టుకొని తెప్పేసుకుంటున్నారు. నీకేమి తెలియదు వదినా నేనప్పుడప్పుడు సిటీ కి వెళ్లొస్తుంటాగా చూస్తూ వుంటాను. సరే వుండు శాంతం అయితే మన రాములు గారికి చెప్పి అమ్మాయిల ఫోటోలు పంపమంటాను. రానే వచ్చారు మరునాడు రాములు గారు. చక్కటి చుక్కలాంటి అమ్మాయిని చూపించారు. అంతా బాగుంది పెళ్లైపోయింది.
హడావుడులన్నీ పూర్తయ్యాయి. చూస్తుండగానే ఒక నెల గడిచింది. విష్ణు తింటున్నాడు, పడుకుంటున్నాడు. అలా సమయం గడిపేస్తున్నాడు. భార్య ఏమండి…! బాక్స్ కట్టమంటారా…? పొలానికి వెళతారా…? విష్ణు పకా పకా నవ్వి నేనా…! పొలానికా…! ఎందుకు…? తాతలనాటి బోలెడు ఆస్తులుండగా నేనెందుకు పొలానికెళ్ళాలి. అదేంటండి అంటే అలా తినేసి ఇలా పాడుకోవడమేనా….! కాదు కాదు అప్పుడప్పుడు కుసేపు కూర్చొని సినిమాలు కూడా చూస్తానులే…! మహా మరీ అలా పడుకొని వుండనులే.
అంటే పూర్తిగా సోమరిపోతన్న మాట అని మనసులో అనుకోని , అత్తగారి దగ్గరకెళ్ళి ఏంటి అత్తయ్య ఈయన పరిస్థితి. ” కూర్చొని తింటే కొండలైన కరిగిపోతాయి ” అంటారు కదా ఇదేనా ఈయన చేసే పని. నాకు పెళ్ళికి ముందే ఈ విషయం ఎందుకు చెప్పలేదు ? నువ్వు చాలా తెలివైన పిల్లలా అనిపించావు నాకు. నా కొడుకు బయటి ప్రపంచం తెలియని ఒత్తి అమాయకుడు. కానీ, పని చేయని సోమరిపోతు. వాడిని నువ్వే మార్చుకోవాలి.
” నీ చేతుల్లో పెడుతున్నా”. అని చెప్పి వెళ్ళింది.
“ఈయన్ని చూస్తే బద్దకానికే యజమానిలా వున్నాడు. ఎలా మార్చాలి దేవుడా..!*
*నాకింత శిక్ష వేశావేంటి..?” అనుకొని,
మరుసటి రోజు ఉదయం విష్ణు అటుగా రావడం చూసి, మహా హలో కూర్చొని, న్యూస్ పేపర్ లో న్యూస్ చదువుతుంది. ” విష్ణు రావడం చూసి కొంచెం పెద్దగా కొత్త రోగం ఒకటి ప్రపంచమంతా పాకుతుంది. అది అధికమైన ఒళ్ళు గల వారికీ తొందరగా వ్యాపిస్తుంది. కాబట్టి ఒళ్ళు వున్నవారు సరియైన వ్యాయామంతో తమ ఆరోగ్యాన్ని కాపాడుకోగలరు.” లేకపోతే ప్రమాద బారిన పడే అవకాశాలు వున్నాయి.
ఈ వ్యాధికి సంబంధించిన చిహ్నాలు:-
= చర్మం ముడుతలుగా మారి తొందరగా
ముసలితనం రావడం.
= ఒళ్ళు మరింత పెరిగిపోవడం.
అది వినగానే విష్ణు కి రోమాలు లేచి కూర్చున్నాయి. తరువాతి రోజు ఆ వ్యాధి గురుతులు నాకు వచ్చాయా…! అని చర్మాన్ని చూసుకున్నాడు. చలికాలం కదా చర్మం పొలుసుగా కనబడడం చూసి నిజంగానే ముసలి తనమొచ్చిందని సందేహపడ్డాడు.స్నానం చేసి వచ్చాక మహా బట్టలు ఇవ్వు అనగానే అప్పుడే విష్ణుకి తెలీకుండా టైట్ చేసి పక్కన పెట్టిన షర్ట్ తీసి ఇచ్చింది. విష్ణు కి కొంచెం టైట్ గా అనిపించడం మల్లి సందేహం వచ్చింది. అంటే, ఆ వ్యాధి నాకు వచ్చేసింది అనుకోని. మహా నిన్న ” అదేదో వ్యాధి లక్షణాలు చదివావు కదా దానికి నివారణ కూడా కింద ఇచ్చారా వాళ్ళు …?
ఆ…ఇచ్చారండీ. ఏం లేదు పని చేసేవారినైతే వ్యాయామం చేయమన్నారు అండి. వ్యాయామం లో ఒక్క శవాసనం మాత్రమే చేసేవారినైతే పని కూడా చేస్తే మంచిదన్నారు “. అయ్యో, మహా నాకు అర్ధం కాలేదు. మహా నవ్వుకొని మీకు సందేహం వుంది కాబట్టి ఒక్క రెండే రెండు రోజులు మీ పొలం వరకు అలా నడుచుకుంటూ వెళ్లి రండి. వామ్మో 5 km నేను వెళ్ళాను. సరే మీ ఇష్టం. వామ్మో నిజంగా ఆ వ్యాధి నాకు వస్తే అని మనసులో అనుకోని, సరేలే మహా నువ్వు చెబుతున్నావ్ గా వెళతాను. మూడో రోజు తనకు తానె ఉత్సహం గా బయలుదేరాడు. ఏంటండీ ఈ రోజు వెళుతున్నారా…? ఆ. .. వెళుతున్న మహా అలా పొలం గట్లెంట వెళుతుంటే చాల ఉత్సహంగా అనిపించింది. ” వ్యాధి సంగతేమో గానీ నాకైతే శరీరం తేలిగ్గా…మనస్సు ఆహ్లాదంగా వుంది వెళ్ళొస్తాను. .” అనగానే మహా చాల సంతోషపడింది .ఇదంతా తెలుసుకున్న విష్ణు వాళ్ళ అమ్మ కోడలిని మెచ్చుకొని నా కోడలు పిల్ల మహా.. ” మహా తెలివైన కోడలు పిల్ల అని మెచ్చుకుంటుంది.
నీతి : ” పని అనేది డబ్బు కోసమే చేసేది అయినా మనస్ఫూర్తిగా చేస్తే అది మనసుకు ఉత్సహాన్ని , శరీరానికి మంచి వ్యాయామాన్ని ఇచ్చే మంచి ఔషధం వంటిది. తరగనంత ఐశ్వర్యం వున్నా అనుభవించే ఆరోగ్యం లేకపోతే అంతా సున్నా.. మనకు నచ్చినట్టు లేరని అయ్యో… నా *కర్మేంటి అనుకుని విడిచిపెట్టడంలో వున్న ఆనందం కన్నా మనకు నచ్చిన రీతిలో కొంచెం మన తెలివితేటలతో మార్చుకోగలిగితే వాళ్ళను బాగుచేసే వైద్యులం మనమే కావొచ్చు.”

You May Also Like

One thought on “తెలివైన కోడలు పిల్ల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!