సహాయం

(అంశం : “మానవత్వం”)

సహాయం

రచన: చెరుకు శైలజ

నేను రమ ఒక దగ్గరే కలిసి స్కూల్లో పని చేసేవాళ్ళం.అలాగ మధ్య, మధ్య ఫోనులో మాట్లాడుకునే వాళ్ళం.
ఒకరోజు ఏడుస్తూ కాల్ చేసింది . వాళ్ళ బాబుకి బాగాలేదు హాస్పటల్లో వున్నాడు అని బాధ పడింది. నా జాబ్ లేదు. ప్రైవేట్ కదా
ఈ కరోనా వలన పోయింది.
మా ఆయన చిన్న జాబ్ బాబుకి లక్ష వరకు అవుతుందట. సుధ టీచర్ ఏంచేయాలి, ఎలా ఏర్పాటు చేసుకోవాలి.
బాబు గురించి బాధ పడేలా, డబ్బు గురించి ఆలోచించాలా, అని బాధపడింది.మీరు ఏమైనా ఎవరినైనా అడిగి ఒక యాభై వేలు ఇప్పించ గలరా, అంది. ట్రై చేస్తాను. నువ్వు దైర్యంగా వుండు. రమ అంటు ఫోన్ పెట్టేశాను. నా పరిస్థితి కూడా అంతే
ఈ కరోనా వలన భర్తకి జాబ్ పోయింది. బ్యాంకులో వున్న డబ్బులతోనే ఏదో రోజులు గడిచిపోతున్నాయి .
నేను తనకి ఏం సహాయం చేయగలను. అలాగే ఆలోచిస్తూ ,నాకు తెలిసిన డబ్బులు వడ్డీకి ఇచ్చే వాళ్ళను అడిగాను. వాళ్ళు ఈ టైంలో ఇవ్వడానికి భయపడ్డారు. మళ్లీ తిరిగి ఇస్తారో లేదో అని వారి భయం. మా ఆయనని అడిగాను .విషయం అంతా చెప్పాను. దానికి ఆయన మనకే కష్టం గా వుంది. ఇప్పుడు ఎవరికి సహాయం చేస్తాం. నాకు మాత్రం ఎలాగైనా సహాయం చేయాలని వుంది నా బంగారి గొలుసు తీసి అమ్మేసి ఇస్తాను. .ఆ గొలుసు బీరువా లో ఒక అలంకరణ వస్తువుగా వుండే కంటే ఒకరి ప్రాణాన్ని కాపాడేదిగా అయితె అంతా కానీ కావాల్సింది ఏముంది అన్నాను. ఆయన రేపు కష్టకాలంలో మనకి ఈ గొలుసు అవసరం రావచ్చు అన్నారు. దేవుని దయ వలన మనకి అంతా ఇబ్బంది రాదు ఒకవేళ వస్తే ఈ నా మెడలో ఉన్న గొలుసు ఉంది కదా అన్నాను.ఆయన ఏమి మాట్లాడలేదు.మౌనం అంగీకారం గా భావించి ,.
రెండు తులాల గొలుసు షాపు లో అమ్మే శాను. రమకి కాల్ చేసి షాపు దగ్గరికి రమ్మనాను. రమకి యాభై వేలు కవర్లో పెట్టి ఇచ్చాను. సుధ టీచర్ మీరు ఆపదలో ఆదుకున్న దేవత. ఇంత ఎవరు చేస్తారు అంటు నమస్కారం చేసింది. అంతా పెద్ద మాటలు వద్దు. ఈ మాత్రం కష్టకాలం లో ఒకరినొకరు చేసుకోకపోతే ఏలాగ.
గొలుసు తీసి మరి మీ అంతా ఎవరు చేస్తారు. బీరువాలో వున్న బంగారాన్ని తీసి ఒక మంచి పనికి వాడాను .అంత కన్నా కావాల్సింది ఏముంటుంది.అంది సుధ. టీచర్ మీ మేలు నేను ఈ జన్మలో మరిచిపోను కన్నీళ్లు నిండిన కళ్ళతో అంది రమ.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!