ఆఫ్ట్రాల్ ఆడది

ఆఫ్ట్రాల్ ఆడది

రచన:పద్మజ రామకృష్ణ.పి

భార్యగా పొందిన నీ మనసుకు తెలిసేదెలా ఆమె అంతరంగం.!

ప్రతి నిత్యం నా మనసు ఇది.నా ఆలోచనలు ఇవి అని తెలిపే ఆరాటంతో అల్లాడుతుందేమే తను. గమనించు ఒక్కసారైనా..

ఎన్నిసార్లు నీ ఇష్టానికి తన గౌరవాన్ని తాకట్టు పెట్టిందో తన మనసుని తడిమి చూడు..

మనసు విప్పి మాట్లాడే రెండు మాటలు నీ నుండి కరువై వేదన పడుతుందేమో అడిగి తెలుసుకో..

అమ్మగా ఆదుకోగలదు..అవసరమైతే అపరభద్రకాళి గానూ మారగలదు..

అన్ని రంగాల్లో రాణిస్తూ ముందుకు సాగుతూనే ఉంది.అయినా ఆఫ్ట్రాల్ ఆడదిగా మిగిలిపోతుంది.

జీతమెరుగని దాసిగా కుటుంబం కోసం తాను చేసే త్యాగాలు ఎన్నని చెప్పాలి.ఏమని చెప్పాలి..

ఆమె కుటుంబం గురించి చేసే త్యాగల పై రచనలు చెయ్యాలి అంటే.నీ పెన్నులో సిరా చాలదేమో.!

సంద్రం లోతునైనా అంచనా వేయగలవేమో.!
ఆడదాని మనసు ఎప్పటికీ తెలుసుకోలేవు.!

ఆమె మనసు తెలిసిన నాడు ఇక ఉండదు నీకు తెలియనిదంటూ ఏమీ..

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!