కవన వేదన

కవన వేదన

రచన: చైతన్య దేశాయ్

ఎన్ని రోజులైంది కలము పట్టి
ఎన్ని రోజులైంది మనసు తట్టి
భావాన్వేషణలో విహరిస్తూ
అక్షర హవనం చేసి…
సుందర కవనం రాసి…

క్షణం తీరిక లేని
రణం తీరుగ పని
ఊహాలన్నీ అడుగంటి
ఊగిసలాడు సమయాన
భావం పురివిప్పదు
కవనం వికసించదు.

యాంత్రిక జీవన
శైలికి దాసోహమై,
శాంతికి దూరమై…
దయనీయమై
గుండె లోతుల్లో
భావాలు అడుగంటి….
మండి నా హ్రుదిలో
హావనాన్ని రగిలించి
తక్షణమే భారమై నేను
అక్షరానికి దూరమై నాను.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!