ఆశీస్సులు

ఆశీస్సులు

రచన: పి. వి. యన్. కృష్ణవేణి

రూపు చూడముచ్చటగా ఉండు
మా ఇంటమహాలక్ష్మి కొలువై ఉండు
సిరుల ఇవ్వ బోను చూచుచుండు
మనసున ఆనందం  కలిగించుండు

అమ్మ చల్లని చూపే మాకు అండ
సమర్పించెదము ఆ మల్లెలదండ
అమ్మ ఆశీస్సులు చిరకాలం ఉండ
ఆ తల్లి మాకు దారి చూపుచుండ

శ్రావణమాస శ్రావణ లక్ష్మీ రావమ్మ
విందు భోజనం ఆరగింప రావమ్మ
రంగుపువ్వు హారం అందుకోవమ్మ
నాకు మీ దీవెనలు అందివమ్మా

ఆ దేవి మహత్యం ఇదేనేమో
పువ్వుల తోరం మహిమ అదేనేమో
కథ ప్రభావమే వెల్లి విరిసినదేమో
అందులకే నా మనసున ప్రశాంతత కలిగెనేమో!!!!

ఆడపిల్లను ఆదిశక్తిగా భావించు
అన్నింటా ఆమెను ప్రొత్సహించు
నీచ ప్రవర్తన పాశ్చాత్య సంస్కృతిని విడచుచు
అన్నింటా నువ్వు ఆమెను ఆదరించు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!