(అంశం:”అంతరంగం ప్రశ్నిస్తే’)
చిగురించిన జీవితం
రచన: సుజాత కోకిల
నా అంతరంగాన్ని నన్ను నేను ప్రశ్నించుకున్నప్పుడు
నా అంతరంగంలో ఎన్నో చిక్కు ప్రశ్నలు
చెప్పలెేక నా మనసు ఒక ప్రశ్నల మిగిలింది
నా చుట్టూ వ్యాపించిన సుడిగుండాలలో
చిక్కుకున్న మా బతుకులు
అలల తాకిడికి రెపరెపలాడుతున్న జీవితాన్ని
నిలబెడుతూ పరుగులు పెడుతూ
చీకట్లను తొలగిస్తూ చిగురించే ఆశయాలను వెతుక్కుంటూ
అలుపెరుగని సూరీడులా ఘగనాలను దాటుకుంటూ విజేతగా తిరిగి
వచ్చినప్పుడు అంత రంగానికి మంచి సమాధానం
దొరికినప్పుడు ఆ ఆనందమే వేరు
సుడిగుండాలన్నీ తొలగిపోయి ఈ జీవితానికి
అర్థం పరమార్థం దొరికింది
…………………………………………………………..