(అంశం:”అంతరంగం ప్రశ్నిస్తే’)
సమాధానం రాని అంతరంగ ప్రశ్నలు
రచన: నాగ రమేష్ మట్టపర్తి
కన్నది, కట్టుకున్నది ఆడదేనని
వారు లేనిదే మనుగడే లేదనే నిజం తెలిసినా
గర్భస్థ శిశువు ఆడపిల్ల అని తెలిస్తే
కడుపులోనే కరిగించే కుటిల నీతిజ్ఞులను
వారి అంతరంగం ప్రశ్నిస్తోంది…!?
మీరు చేసే పని సరైనదేనా అని…!!!???
మగ పిల్లవాడు పుడితే వారసుడు పుట్టాడని,
ఆడపిల్ల పుడితే అరిష్టంగా భావిస్తూ
వారసుడికి ఉత్తమ విద్యను అందిస్తూ,
ఆడ పిల్లని వంటింటికి పరిమితం చేస్తూ
సంతానం విషయంలో లింగ వివక్షతను చూపించే వారిని వారి అంతరంగం ప్రశ్నిస్తోంది….!?
మీరు చేసే పని సరైనదేనా అని…!!!???
వృద్ధాప్యంలో ఆయాసంతో సాయం కోసం
ఎదురు చూసే తల్లిదండ్రులను నిర్దయతో
వృద్ధాశ్రమాలలో విడిచిపెట్టే వారిని
వృద్ధాప్యంలో నీ పరిస్థితి కూడా ఇదేనని
తెలుసుకోమని వారి అంతరంగం హెచ్చరిస్తూ ప్రశ్నిస్తోంది….!?
మీరు చేసే పని సరైనదేనా అని…!!!???