మరో రూపం
అంశం:నిన్ను దాటి పోగలనా
ఏ పని చేసినా వెంట ఉండే స్నేహితుడివి
బాధలో ఓదార్చే భాను కిరణానివి
సంతోషంలో రెచ్చిపోదాం బ్రదర్ అంటూ
నాతోనే గంతులేసే నా నీడవి
నా నిర్ణయాలకి ఆలోచనలకి నెలవు
మార్గాన్నెనుకొనే శక్తి ప్రధాతవు
మనోల్లాసానికి మనో నిబ్బరానికి
మూలమై నను నడిపిస్తావు
నాతో నీవున్నావనే ధైర్యంతోనే
జీవిస్తున్నా
నిను దాటి ఏ ఒక్కటీ నేను చేయలేను
నా ఆనందం నీవే
ఆవేదన నీవే
ఆవేశం నీవే
నీవు నాలోని ఆత్మవు మాత్రమే కావు
నీవు నా మరో రూపానివి
విడదీయలేని అనుబంధానివి….!
రచయిత :: చైత్రశ్రీ(యర్రాబత్తిన మునీంద్ర)
చాలా బాగుంది మీ కవితా భావం👏👏👏