పమిట చెంగు

పమిట చెంగు

అంశం :: నిన్ను దాటి పోగలనా

నే పుట్టినప్పుడే నేనునంటూ  నా దరి చేరావు…
నీ ఓడిలో  చేర్చుకుని ఓలలాడించావు…
నను హత్తుకుని గిలిగింతలు పెట్టావు…
ఊపిరి సలపని అయోమయంలో పడేసావు…
రకరకాలుగా నన్ను కవ్వించావు…
నే పుట్టినప్పుడు ఎండ వాన చలికి నీవే తోడైనావు…
బంధువుల అందరి నడుమ కొత్తగా రూపుదిద్దుకున్నావు…
ఆనాటి నుండి ఈనాటి వరకు…
నా ప్రతి సుఖం లో…
దుఃఖంలో పాలుపంచుకున్నావు…
కొంగుముడితో  బంధం కలిపావు…
పతి చెంత చేరేవేళ సిగ్గుల మెులకనైన నన్ను నీ యదలో దాచుకున్నావు…
చెడుచూపు తగలనివ్వకుండా ముసుగైనావు…
అలసి సోలసిన వేళ పడకవైనావు…
కంటనీరు కనబడనివ్వకుండా  నీలో దాచుకున్నావు…
నా అరచేతి సౌందర్యాన్ని కాపాడుతూ, నా చేత బంధీవైనావు
ఓ పమిట చెంగా నిను దాటి పోగలనా!?…
నిను వీడి నేనుండగలనా!?

రచయిత :: సావిత్రి తోట “జాహ్నవి”

You May Also Like

2 thoughts on “పమిట చెంగు

  1. బాగుంది పమిట చెంగు చాటున దాగిన భావాల అల్లిక👏👏👏😊😊

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!