కలల ప్రపంచం

కలల ప్రపంచం

(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: శ్రీదేవి విన్నకోట

కలల ప్రపంచం అందమైనది
మనల్ని ఆనందింప చేసేది
కలత నిద్రలో ఒక కల గాఢనిద్రలో మరో కల
ప్రతి మనిషికి ఎన్నెన్నో కలలు
అందులో కొన్ని సాకారం
మరికొన్ని నిరాకారం
మనం పగటి కలల్లో ఉండిపోతే
మన జీవితం చీకటిమయమే
కల రాని మనిషి కలతలేని కాపురం
కోపం రాని మనిషి మంచితనం
పుడమి పై లేదనుకోవడం మన కల
ప్రతి మనిషి  కలలు కనాలి
ఆ కలలను నిజం చేసుకోవాలి
అసలైన కలల ప్రపంచం మనదే కావాలి
ఆ కలల ప్రపంచంలో కాసేపు తేలినా మునిగినా
మనం మనుషులం
నిజంలోనేబ్రతకాలి,నిజంతోనేబ్రతకాలి
నిజాయితీగా బ్రతకాలి
కలల్ని దూరం పెట్టి మనం సత్యమార్గం పడితే,
ఆనందమైన జీవితం మన సొంతమవుతుంది
అందుకే అందరూ కలల ప్రపంచం వదలండి
నిజంలోనే నిజాయితీగా జీవించండి
ఎల్లప్పుడు నిజమే మన ప్రపంచం కావాలి
కల ఎప్పటికి ఒక అబద్ధమే
నిజమే మన సుగమన జీవన మార్గం
అందుకే అటే మన  పయనం కొనసాగీస్తూ అంతవరకు కల కానిది నిజమైనది
అని పాడుకుంటూ కాలాన్ని గడిపేయండి.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!