ఆత్మవిశ్వాసం

ఆత్మవిశ్వాసం

(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: జక్క.నాగమణి

మానవ జీవితానికి పునాది విశ్వాసం
జీవితం సన్మార్గంలో నడిపించు మూలం
ధైర్యం ఇచ్చే ఔన్నత్యము ఇంధనము
ఆధ్యాత్మిక జీవనానికి పురోగమనము
సంపూర్ణ విశ్వాసంతో విజయము తథ్యము

బుద్ధిని శుద్ధిచేసి ధైర్యము ఇవ్వడము
తాబేలు విశ్వాసంతో ఊహించని విజయము
కంటికి కనిపించని అంతరంగ ఆకాశము
నిత్యసాధనతో శాశ్వత విశ్వాసము
అవరోధాల్ని దాటి ధైర్యమిచ్చే నమ్మకము

సాధనలో ధైర్యము ఇచ్చే నమ్మకము
ఆత్మ విశ్వాసం గల వ్యక్తులగాధలే చరిత్రము
వ్యక్తిలోని దివ్యత్వము విశ్వాసం
మనిషి లో ఉన్న అనంత శక్తి విశ్వాసము

అపజయమెదురైనా వెలుగునిచ్చే విశ్వాసము
నమ్మకమే శాశ్వత విశ్వాసానికి మూలము
కష్టంలో ధైర్యాన్ని నింపే కృష్ణ ప్రబోధము
క్రమశిక్షణ ఆయుధమై సాధించు విజయము

యువతలో స్ఫూర్తి నింపే మార్గము
విజయసాధనలో మహత్తర అలంకారము
ప్రణాళికతో అడుగులు వేస్తూ విజయము
ప్రయత్నసాధనకు నమ్మకమే మూలము.
వెలకట్టలేని ఆభరణం ఆత్మవిశ్వాసం

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!