ఏడు పెండ్లిళ్లు

(అంశం. :”ఆ చీకటి వెనకాల”)

ఏడు పెండ్లిళ్లు

రచయిత :: జీ వీ నాయుడు

అది ఒక మండల కేంద్రం. జాతీయ రహదారి పై ఉండే గ్రామం. బ్యాంకు, పలు ప్రభుత్వకార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు ఉండే ఊరు. . ఆ ఊళ్ళో ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి నివాసం ఉన్నారు. అతను బాగా ఆస్తి అంతస్తులు ఉన్న అమ్మాయి లను లోబరచుకోవడం, అధిక కట్నకానుకాలతో వివాహా లు చేసుకోవడం లో సిద్దహస్తుడు.పల్లెటూరు పిల్లలను నచ్చరు. అంతా పట్టణాలు, నగరాల్లల్లోనే ఇతని చీకటి వెనుకాల కార్యక్రమాలు.
” హలో మేడం. నా పేరు కృష్ణ. మీ అపార్ట్మెంట్ లో టు లెట్ బోర్డు ఉంది. అది మీదేనా. నన్ను ఎప్పుడు రమ్మంటారు. హౌస్ చూడ్డానికి ” అంటూ పరిచయం చేసుకుంటారు.ఇలా టు లెట్ బోర్డులు, హౌస్ సేల్స్ బోర్డులు వెతకడం తో అతను కొందరి యువకులకు జీతం చెల్లించే వాడు. ఒక రోజు విజయవాడ లో ఓ త్రిబుల్ బెడ్ రూం హౌస్ సేల్ కు వచ్చింది.. ఆ ఇంటి యజమాని కుమార్తె వివాహం కోసం ఈ హౌస్ ఒకటి అమ్మకం పెట్టారు.. ఇంకేముంది.. కృష్ణ రంగ ప్రవేశం చేశారు.
రెండు మూడు సార్లు వారి ఇంటికి హౌస్ పని మీద వెళ్లి, వారి అమ్మాయి కే టెండర్ పెట్టాడు. తాను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని అని… ఇక మొత్తానికి ఉన్నవి, లేనివి వారికి ఎక్కించి, ఆ హౌస్ ని, పిల్లను, మరింత కట్నం తో మొదటి వివాహం సమాప్తం చేసాడు. విజయవాడకు బదిలీ చేయించుకుంటాను అని నమ్మబలికారు. మేరేజ్ బ్యూరో తో రెండో వివాహం హైదరాబాద్ లో. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కావడంతో బెంగుళూరులో ఒక వారం ట్రైనింగ్ కోసం వెళ్లి మూడో వివాహం ఏర్పాట్లు చేసి మరో నెలలో మూడో ఫస్ట్ నైట్ సమాప్తం.. నాలుగో వివాహం నెల్లూరు. ఇలా నాలుగు, అయిదు,, ఆరోవివాహం కూడా చేసుకొని ఆనంద డోలికల్లో ఊగుతున్నాడు.. ఇప్పుడు అసలు సీన్ మొదలయింది. ఏడో వివాహం అతనికి ఉరి తాడు అయింది..ఒక అప్సరస లాంటి కేరళ అమ్మాయి ఫై అయ్య గారి కన్ను పడింది. వారి నివాసం చెన్నై.. మొత్తానికి ఆ అప్సరస ను ప్రేమ పంజరంలో దింపాడు ప్రేమ వివాహం అయినా అమ్మాయి వాళ్ళ పెద్దల అంగీకారం తోనే జరిగింది. ఆ అమ్మాయి కి తెలుగు రాక పోయినా, తానే బదిలీ చేయించు కుని చెన్నై లో స్థిర పడతాను అని, నాకు నచ్చిన అమ్మాయి ఇప్పుడే దొరికింది అని, 5 ఏళ్లుగా సంబంధాలు చూసి ఇసుకు వచ్చింది అని నమ్మించారు.పెళ్ళి అయింది. అక్కడ రెండు రోజులు, ఇక్కడ రెండు రోజులు జెల్సా చేస్తూ.. ఉద్యోగం తో తీరిక లేదంటూ అందర్నీ నమ్మించాడు. ఏడవ భార్య అందానికి, ఐశ్వర్యం తోడు కావడం తో ఎక్కవ శ్రద్ద చూపే వారు. ఒక వీకెండ్ కు వస్తున్నా అని మరీ కబురు చేసి చెప్పడం తో అందాల రాణి ముస్తాబు అయింది. కృష్ణ. ఆ రోజు ఉద్యోగ విధులు పూర్తి చేసుకొని, నాలుగవ భార్య గర్భిణీ కావడంతో మొదట ఆమె దగ్గరికి వెళ్లి అక్కడ పండ్లు వగైరా అందజేసి.. ముద్దు.. ముచ్చటయా తీర్చుకుని , ట్రైనింగ్ కోసం వెళ్తున్నా అని ఒక హ్యాపీ కిస్ ఇచ్చి, చెన్నై కి బయలు దేరాడు. అక్కడ కు వెళ్లే టప్పటికి రాత్రి 11అయింది. ఆ ఇంటిల్లపాది ఘాడ నిద్ర లో ఉన్నారు. అందాల అప్సరస రాకుమారుని రాక కోసం అన్నట్లు నిరీక్షిస్తుంది. అంతే అయ్యగారు రాగానే హాగ్ చేసుకొని లోపల కి వెళ్ళింది జంట.స్నానం భోజనం షరా మామూలే. చీకటి వెనుక ఎందుకు అంటూ అలంకరించిన గదిలోనే రాత్రంతా ఆనందం ఆకాశ స్థాయి లో ఉప్పొంగింది. ఉదయం 10 గంటలకు నిద్ర లేచిన అప్సరస, శ్రీవారి దుస్తులను పని అమ్మాయి కి ఇచ్చి వాషింగ్ మిషన్ లో వేయించేందుకు రెడీ అయింది. అయ్యగారుప్యాంట్లో పర్సు, పెన్ హ్యాండ్ కర్చీఫ్ తీస్తుంటే…ఒక రిబ్బన్, వాడిన పూలగుత్తి ఒక పెద్ద ఎంట్రుకతో కలిసి ఉండే చిన్న ప్యాక్ అందులో ఒక చిన్న స్లిప్.. ఆ స్లిప్ లో ” హ్యాపీ జైర్నీ… పాప పుడితే పూజిత.. బాబు పుడితే నీ పేరే పెట్టుకుందాం .. ఇది నిన్ను సర్ప్రైజ్ చెయ్యడానికి పెడుతున్నా… కిస్ యు… లవ్ యు డార్లింగ్… అనే స్లిప్ బయట పడింది… అంతే అతను నిద్ర పోతున్న బెడ్ రూమ్ లాక్ చేసుకుని.. అదే వరుసలో తన అన్నయ్య బెడ్ రూం దగ్గర కి వెళ్ళింది. ఆ కుటుంబం లో నలుగురు ఇంటిలిజెన్స్.. లా అండ్ ఆర్డర్, సి ఐ డి విభాగాల్లో హై లెవల్ అధికారులే.. బెడ్ రూం బెల్ మొగగానే వాళ్ళ అన్నయ్య తలుపు తీసాడు.. ఏమిటి చిన్ని…. ఇలా వచ్చావ్.. రాత్రి బావ గారు రాలేదా… అనే లోపే.. అన్నయ్య ను గట్టిగ పట్టుకుని ఏడ్చేసింది… ఏమిటీ.. ఏమైంది… అనే లోపే ఆ స్లిప్ ఆ వాడిని పూల గుత్తి అన్నయ్య చేతిలో పెట్టింది.. ఇది అతను ప్యాంటు లో ఉంది అని చెప్పింది.. నిద్ర పోతుంటే లాక్ చేసి వచ్చాను అని చెప్పింది.. నువ్వు వెళ్లి అతన్ని లేపకుండా అతను మొబైల్ తీసుకొని లాక్ చేసుకొని రా… అన్నాడు.. అదే పని చేసింది.
మొబైల్ స్రీన్ లాక్ లో ఉంది.. వాళ్ళ డిపార్ట్మెంట్ స్టైల్ లో ఓపెన్ చేసి కాల్ చెయ్యడం మొదలుపెట్టారు. అతను ఇక్కడ కి వచ్చే ముందు ఎక్కడికి వెళ్ళాడో తెలియాలి అంటూ రాత్రి వచ్చిన కాల్ చేశారు.. అంతే అవతలినుంచి ” హాయ్ శ్రీవారు.. లేచావా.. రాత్రి అంత స్విచ్ ఆపావు ఏమి అంటూ ఆగకుండా మాట్లాడుతూనే ఉంది.. మర్చిపోయా.. నీకు సర్ప్రైజ్ చేద్దాము అని ఒకటీ పెట్టాను ప్యాంటు ప్యాకెట్ లో చూడు… రాత్రి అంతా నిద్ర రాలేదు… మళ్ళీ ఫ్రెష్ అయి చేస్తాను.
కిస్ యు… లవ్ యూ బాయ్ అని పెట్టేసింది.. అన్నయ్య… నేను బ్రతకడం వేస్ట్ అంది… అంతా విని ఏడుస్తూ… నువ్వు ఫ్రెష్ అయ్యి రా ముందు అంటూ చెల్లిని పంపి.. ఆలోచన లో పడ్డాడు.. నా చెల్లి జీవితం ఇలా అవుతుంది అనుకోలేదు. సరే.. అంటూ ఫ్రెష్ అయ్యి అందరు ఒక చోట చేరి ప్లాన్ చేశారు…
నిద్ర పోతున్న అతన్ని లేపారు.. అందర్నీ ఒక్క సారి చూడగానే భయం ఆవరించింది…. “” అడిగే వాటికి నిజం చెప్పు.. నీ శవం అయినా మీ ఇంటికి పంపుతాము అనే సరికి అతను వణికిపోయాడు.. నువ్వు మాములుగా చెప్పవు.. అంటూ వాళ్ళ స్టైల్ లోకి వెళ్లారు.. రెండు, మూడు గంటల్లోనే మొత్తం ఏడు మంది వ్యవహారం బయటకు తీసి జైలుకు పంపారు… అందం కాదు… తల్లి.. హృదయం ఉండే వాళ్ళను ప్రేమించాలి… ఇష్టపడాలి.. అంటూ అప్సరస ను ఓదార్చారు. చీకటి వెనుకాల కార్యక్రమాలు అంటే ఇలాంటి వే. అంటూ చెల్లి కి నచ్చచెప్పి మరో వివాహం చేశారు…
ఏడుమంది అతను మోసం చేశాడని చెప్పడంతో అతనికి ఉరిశిక్ష ఖరారు అయింది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!